Latest

Loading...

Favipiravir మార్కెట్లోకి ఫావిపిరావిర్ ఓరల్ సస్పెన్షన్...!!



 

భారతదేశపు మొట్టమొదటి ఓరల్‌ సస్పెన్షన్‌ ఫావిపిరావిర్‌ - ఫావెంజా ఓరల్‌ సస్పెన్షన్‌ ను ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ విడుదల చేసింది. మోస్తరు నుంచి మధ్యస్తంగా ఉన్న కోవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ పై మాత్రమే విక్రయించే ఈ సొల్యూషన్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ మెడికల్‌ ఔట్‌లెట్లు మరియు ఆస్పత్రి ప్రాంగణాలలోని ఔషద విక్రయశాలల్లో లభ్యమవుతుంది. ఫావెంజా సస్పెన్షన్‌ లోడింగ్‌ డోస్‌ (మొదటి రోజు) 18 మిల్లీ లీటర్లు ఉదయం అలాగే సాయంత్రం 18 మిల్లీ లీటర్లను వాడవలసి ఉంటుంది.

ఈ ఫలితాలు ఫావిపిరావిర్‌ 400మిల్లీగ్రాముల 9 మాత్రల వినియోగానికి సమానంగా ఉంటుంది. తద్వారా కోవిడ్‌-19 చికిత్స సౌకర్యవంతంగా మారుతుందని సంస్థ ప్రకటించింది.

ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ మయాంక్‌ టిక్కా మాట్లాడుతూ'మరోమారు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కోవిడ్‌-19 చికిత్సను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంపై మేము దృష్టి సారించామని అన్నారు. కరోనా మహమ్మారితో చేస్తోన్న యుద్ధంలో దేశంలోని మన హెల్త్ కేర్‌ వారియర్లుకు అనుకూలమైన అవకాశాలను అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

No comments

Powered by Blogger.