Fingers sounds:చేతి వేళ్లను విరిచినప్పడు శబ్దం వస్తుంది. ఎందుకో తెలుసా ...?
Fingers sounds : సాధారణంగా మనలో చాలామందికి వెళ్ళను వెనక్కి పక్కకి పంచడం వలన శబ్దం అనేది వస్తుంది. ఇలా వంచటం వలన కొంత మందికి పిజికల్ రిలాక్స్ వస్తుంది. మరి కొంతమంది టైంపాస్ కి చేస్తూ ఉంటారు. మొదటిసారి విరిచినప్పుడు శబ్దం వస్తుంది రెండో సారి విరిచినప్పుడు ఎలాంటి శబ్దం రాదు. మొదటిసారి ఆ శబ్దం ఎందుకు వస్తుందో మనలో చాలామందికి తెలీదు. ఎముకలు కదలటం వలన శబ్దం వస్తుంది అని భావిస్తారు
కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. మన శరీరంలో రెండు ఎముకల మధ్య ఉండే సినోవియల్ ఫ్లూయిడ్ లూబ్రికేట్ గా పనిచేస్తుంది చేతులను వేళ్లను వంచినప్పుడు లేదా విరిచినప్పుడు ఈ ఫ్లూయిడ్ నుండి నైట్రోజన్ గ్యాస్ విడుదలవుతుంది.
నైట్రోజన్ గ్యాస్ బుడగల ను ఉత్పత్తి చేస్తుంది ఈ బుడగలు పగిలినప్పుడు శబ్దం వస్తుంది. మరల ఈ నైట్రోజన్ బుడగలు రావాలి అంటే కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. చాలా మంది టైం పాస్ కోసం తరచుగా ఇలా వేళ్లను విరుస్తూ ఉంటారు.
మన శరీరంలోని ఎముకల మధ్య ఉండే ఈ సినోవియల్ ఫ్లూయిడ్ ఎముకలకు నొప్పి పుట్టకుండా, అవి అరిగిపోకుండా స్మూత్ గా కదిలేలా ఈ లూబ్రికెంట్ ఉపయోగపడుతుంది. వయసు మీద పడ్డవాళ్లలో ఈ ఫ్లూయిడ్ అయిపోవటం వల్ల మోకాళ్ల నొప్పులు,కీళ్ల నొప్పులు వస్తుంటాయి.
No comments