Latest

Loading...

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. భారీగా డిస్కౌంట్..?

Gas Booking

 ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయలకు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఈ వాలెట్ సంస్థ పేటీఎం గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై పేటీఎం ఏకంగా 900 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. సిలిండర్ బుకింగ్ చేసుకునే వాళ్లకు ఈ బంపర్ ఆఫర్ వల్ల ఊరట కలగనుంది. అయితే ఈ ఆఫర్ ను అందరూ పొందడం సాధ్యం కాదు. ఎవరైతే పేటీఎం ద్వారా తొలిసారి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది. 900 రూపాయల లోపు ఎంతైనా క్యాష్ బ్యాక్ లభించే అవకాశం అయితే ఉంటుంది.


గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న 24 గంటల లోపు ఈ క్యాష్ బ్యాక్ డబ్బులు లభించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఆఫర్ ను పొందాలని అనుకుంటారో వారు పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.


పేటీఎం తీసుకొచ్చిన ఈ ఆఫర్ వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలగనుందని చెప్పవచ్చు. పేటీఎం యాప్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఆఫర్ ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

No comments

Powered by Blogger.