Latest

Loading...

Gas cylinders గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ నంబర్స్ ఏంటో మీకు తెలుసా....?

Gas cylinders

 గ్యాస్ సిలిండర్లపై మనం కొన్ని కోడ్స్ గమనించవచ్చు. ప్రతి గ్యాస్ సిలిండర్ పై ఓ ఆంగ్ల అక్షరం, రెండు అంకెలు కనిపిస్తాయి. అయితే ఇవి మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం కానీ వాటి అర్థం ఏంటో అసలు తెలుసుకోము. నిజానికి ఈ కోడ్స్ వెనుక దాగున్న అర్థాన్ని ప్రతి గ్యాస్ సిలిండర్ వినియోగదారుడు తెలుసుకోవాలి. అయితే ఈ కోడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ ఆర్టికల్ వివరంగా తెలుసుకుందాం.


సిలిండర్లపై ఏబిసిడి అనే నాలుగు ఆంగ్ల అక్షరాలు కనిపిస్తుంటాయి. ఇందులో ఏ(A) జనవరి నుంచి మార్చి నెల వరకు సూచిస్తుంది. బీ(B) ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు సూచిస్తుంది. సీ(C) జులై నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు సూచిస్తుంది.

డీ(D) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సూచిస్తుంది. అంటే ఏం ప్రతి లెటర్ సంవత్సరంలోని ఒక త్రైమాసికాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ లెటర్స్ పక్కనే రెండు అంకెలు కనిపిస్తుంటాయి. అవి సంవత్సరాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకి A-23 అంటే 2023 సంవత్సరం జనవరి నుంచి మార్చి నెల అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కోడ్ గ్యాస్ సిలిండర్ల యొక్క ఎక్స్‌పైరీ డేట్ ని తెలియజేస్తుంది.


ఉదాహరణకు మీరు మీ గ్యాస్ సిలిండర్ పై B-24 అని ప్రింట్ చేయడం చూసి ఉంటే.. మీ గ్యాస్ సిలిండర్ 2024 ఏప్రిల్ - జూన్ నెల లోపు ఎక్స్‌పైరీ అవుతుందని అర్థం. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు దాదాపు పది సంవత్సరాల ఎక్స్‌పైరీ డేట్స్ తో వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ఒకవేళ ఎక్స్‌పైరీ దాటిపోయిన సిలిండర్లు కొనుగోలు చేసినట్లు అయితే వాటివల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. వినియోగదారులు సిలిండర్స్ కొనుగోలు చేసే ముందు దానిపై ప్రింట్ చేసిన ఎక్స్‌పైరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డేట్ దాటిపోయినా సిలిండర్ కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేసేయండి.


No comments

Powered by Blogger.