Latest

Loading...

Health Benefits of Jaggery: ఉదయాన్నే బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే షాకవుతారు....!!!

Health Benefits of Jaggery

 Jaggery Health Benefits: ఉరుకులు పరుగుల దైనందన జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. ఇలాంటి క్రమంలో కొన్ని చిట్కాలను పాటిస్తే.. సులువుగా జబ్బుల నుంచి బయటపడేలా చేస్తాయి. వంటింట్లో ఉన్న పదార్థాలను తినడం ద్వారా సులువుగా జబ్బులనుంచి బయటపడొచ్చు. అలాంటి ఔషధంలో బెల్లం ఒకటి. బెల్లంలో అనేక ఔషధ గుణాలున్నాయి. చెక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగిస్తే.. చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెల్లంను ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. దీంతో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వారు బెల్లం.. తినాలని పేర్కొంటుంటారు. ఎర్ర రక్త కణాలని వృద్ధి చేసి ఆరోగ్యంగా మార్చడంలో సహకరిస్తుంది.


ముఖ్యంగా గర్భిణీలు బెల్లం ఎక్కువగా తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఇంత మేలు చేసే బెల్లాన్ని ప్రతి రోజు ఉదయాన్నే తింటే ఎంతో మంచిది. రోజూ 50 గ్రాముల బెల్లం తీసుకుంటే ఎంతో మంచిదని.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


బెల్లం ప్రయోజనాలు..

∙ ఉదర సమస్యలను తొలగించడంలో బెల్లం సహకరిస్తుంది. బెల్లం నిత్యం తినడం వల్ల కడుపు నొప్పి సమస్యలు, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ లాంటి వాటికి చెక్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు.

∙ బెల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఉదయం వేళ అల్లం, బెల్లం కలిపి తీసుకున్నా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

∙ ఎముకలు దృఢంగా మారుతాయి. బెల్లంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా చేయడంలో సాయపడతాయి.

∙ దీంతోపాటు చెక్కర ఉపయోగించకుండా.. బెల్లంను ఉపయోగించడం వల్ల రక్త, షుగర్ సంబంధిత అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

∙ కావున ప్రతీరోజూ ఉదయాన్నే ఎంతోకంత బెల్లం తీసుకోవాలని సూచిస్తున్నారు.


No comments

Powered by Blogger.