Health Tips పాదాల పగుళ్ళకు ఇలా చెక్ పెట్టండి.. !!
వర్షాకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వైరల్ ఫీవర్ లు దాడి చేస్తూ ఉంటాయి. దోమల వల్ల ఈగల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అంతేకాకుండా ఈ కాలంలో చర్మ సమస్యలు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. వాటిలో పాదాల పగుళ్ల సమస్య కూడా ఒకటనీ చెప్పవచ్చు. పాదాలు పగలడం దాని ద్వారా దుర్వాసన రావడం.. ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం అధికంగా కనిపిస్తుంది.
అయితే దీన్ని ఇంట్లో ఉండే కొన్ని రెమిడీస్ తోనే దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో ఉండే కర్పూరంను పొడి చేసి ఆ పౌడర్ ను కలుపుకొని పాదాలకు పట్టించాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకోవాలి. అలా చేస్తే పాదాల పగుళ్ల సమస్యలు దూరం అవుతుంది
అంతేకాకుండా పాదాలను వేడి నీటిలో నానబెట్టడం లాంటివి చేయడం ద్వారా వర్షా కాలంలో దాడి చేసే బ్యాక్టీరియా నుండి కాపాడుకోవచ్చు. ఉల్లిపాయ రసం తీసుకుని పాదాలకు మసాజ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే కూడా పాదాల పగుళ్ల సమస్య దూరమవుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. ఇక ఇలాంటి ఇంటి చిట్కాలతో పాదాలు ఎంతో సురక్షితంగా ఉంటాయి.
No comments