Latest

Loading...

Health Tips మెంతి నీళ్లను తాగండి జుట్టు, చర్మ సమస్యలను దూరం చేసుకోండి ఇలా....!!!

Health Tips

 మెంతి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మనం వండే కూరల్లో కూడా ఎక్కువగా వాడుతాం. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. మెంతి గింజలు చర్మం, జుట్టుకు పోషకాలు అందిస్తాయి. ప్రతి రోజు ప్రతీ రోజు మెంతి నీటిని తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మరి దీనిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇలా చేసుకోవాలి


ఒక బగోణిలో మెంతి గింజలను సన్నని మంటపై వేయించాలి. ఇప్పుడు ఈ విత్తనాలను గ్లైండర్‌లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ మెంతి పొడి వేసి కలపాలి. ప్రతిరోజు ఉదయం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.


మెంతి నీళ్లతో ప్రయోజనాలు


మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ మెంతి నీళ్లను తాగితే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఏమీ తినడానికి ఇష్టపడరు. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఉబ్బరం నివారించడానికి సహాయపడుతుంది.

మెంతుల్లో జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇది జుట్టు మందంగా కావడానికి, చుండ్రు సమస్యలను నివారించడానికి బాగా పనిచేస్తుంది.


మెంతి నీళ్లు శరీరం నుంచి హానికరమైన విష పదార్థాలను బయటకు పంపుతోంది. ఇది జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాద పడుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

మెంతులు షుగర్ పేషెంట్స్ కి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో మెంతులు దోహదపడతాయి. మెంతి గింజల్లో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

మెంతులు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెంతుల వినియోగం మూత్రపిండాలలో రాళ్ల చికిత్సకు సహాయపడుతుంది.

No comments

Powered by Blogger.