Health Tips ప్యాకెట్ పాలను వేడి చేయకుండా తాగుతున్నారా....?
ప్యాకెట్లలో వచ్చే పాశ్చరైజ్డ్ పాలను వేడి చేయకుండా తాగడం వల్ల ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా?
డాక్టర్ సమాధానం: కొలై, సాల్మొనెల్లా, లిస్టీరియా మొదలైన హానికారక సూక్ష్మజీవులను చంపివేయడానికి పాలను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, కొద్ద్ది సేపు వేడి చేసి వెంటనే చల్లార్చి ప్యాక్ చేస్తారు. దీనిని పాశ్చరైజ్డ్ పాలు అంటారు. ఇలా పాశ్చరైజ్ చేసిన పాలను ప్యాక్ చేసిన సమయం నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వద్ద రెఫ్రిజిరేటర్‌లో నిల్వచేస్తే కనీసం రెండు రోజుల పాటు సురక్షితంగా ఉంటాయి. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచి, పాశ్చరైజ్ చేసిన పాలను మొదటి నలభై ఎనిమిది గంటల్లో కాచకుండా వాడినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
కానీ, ప్యాకింగ్ చేసిన సమయం నుంచి మన ఇంటికి చేరే వరకు సుమారు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు పడుతుంది. ఆ పాలు అతి చల్లని ఉష్ణోగ్రతలో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి కాబట్టి ఆ పాలను మళ్లీ కాచి లేదా వేడి చేసి వాడడమే మంచిది
No comments