Latest

Loading...

Health Tips తిన్నాక కడుపు బరువుగా ఉంటోందా....? అయితే ఈ పద్ధతులు మీకోసమే...!


 చాలా మందికి భోజనం చేసిన తర్వాత కడుపు కాస్త బరువుగా ఉంటుంది. అదే విధంగా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీకు కూడా భోజనం చేసిన తర్వాత కడుపు కాస్త బరువుగా ఉందా..? అయితే ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి. మరి ఇక ఆలస్యం ఎందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.


యాలుకలు:


భోజనం చేసిన తర్వాత కడుపు బరువుగా అనిపిస్తే యాలుకలు తీసుకోండి. దీని వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా బ్లోటింగ్ వంటి సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. కనుక మీరు భోజనం చేసిన తర్వాత రెండు యాలుకలని నమలండి.


తేనె:


తేనె వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి

 

భోజనం చేసిన తర్వాత తేనె తీసుకోవడం వల్ల కడుపు బరువు తగ్గుతుంది. అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కనుక మీరు భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు స్పూన్ల తేనెను తీసుకోండి.


కొద్దిగా వ్యాయామం:


మీరు తిన్న తర్వాత కొద్దిగా వ్యాయామం చేయండి. అంటే మీరు నెమ్మదిగా నడవడం లాంటివి చేస్తే బరువు తగ్గుతుంది.


తినేటప్పుడు మాట్లాడద్దు:


మీరు కనుక తినేటప్పుడు మాట్లాడితే నోట్లోకి గాలి కూడా వెళుతుంది. దీని కారణంగా GI ట్రాక్ లో బరువు పెరుగుతుంది.


కొవ్వు పదార్థాలు తీసుకోవద్దు:


ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. అదే విధంగా కెఫిన్ మరియు ఆల్కహాల్ కూడా తగ్గించడం మంచిది. ఇలా ఈ విధంగా కనుక మార్పులు చూస్తే కడుపు బరువు తగ్గుతుంది.


No comments

Powered by Blogger.