Latest

Loading...

Health Tips. రాగులతో ఆ మహమ్మారి రాకుండా చెక్ పెట్టొచ్చు.. వీటి వల్ల మరిన్ని ఉపయోగాలు ఇక్కడ తెలుసుకుందాం..

Health Tips.

 గొప్ప పోషక విలువల్ని కలిగి ఉన్న రాగులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పొటాషియం మరియు కాల్షియం వంటి అద్భుతమైన పోషకాలు రాగుల్లో ఉన్నాయి. అనామ్లజనకాలు మరియు అమైనో ఆమ్లాలను ఇది ఎక్కువగా కల్గిఉంటుంది. ఇది చక్కెరవ్యాధి వంటి రుగ్మతలు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులపై పోరాడడానికి కూడా ఉపయోగించవచ్చు. దక్షిణ భారతదేశంలో ఒకప్పడు రాగుల మన ఆహారంలో భాగం.. ఆ తర్వాత కొన్ని రోజులు మరుగున పడిపోయాయి. అయితే, కొంతమంది ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ చాలా మంది చూపు వీటివైపు మళ్లింది. వీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రాగుల్లో ఉన్న పోషకాలు మెండు. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్నాయి.


అందులో ముఖ్యంగా ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రొటీన్ మిగత ఆహార పదార్థాల్లో అంతగా లభించదు. ఇది శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది.


ఇందులో ఉన్నన్ని పోషకాలు మిగిలిన ఏ ధాన్యాలలోనూ లేవు. కాబట్టి, రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకున్నవారికి పోషకాహారలేమి అంటూ ఉండదు. అంతకే కాకుండా రాగుల్లో మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కాల్షియం 5-30 శాతం ఎక్కువగా ఉంది. ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాల్షియం సప్లిమెంటు తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లెసీమిక్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గాయం తొందరగా తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. యాంటీ-బాక్టీరియల్ గుణాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి.


కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్ కీ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకీ, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది జ్వరంగా ఉన్న సమయంలో మందులు వాడుతుంటారు. అలా కాకుండా దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. రాగులు ట్రైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా చేసి గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. హార్ట్ ఎటాక్స్ గానీ, స్ట్రోక్స్ గానీ రాకుండా చేస్తాయి. ఎలాంటి వారికైనా ఈ రాగులు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇప్పుడు తమ ఆహారంలో చేర్చుకుని ప్రయోజనాలను పొందుతున్నారు. రాగుల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ సెల్ డామేజ్ జరగకుండా చేసి కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. కాబట్టి, ముందు నుంచే వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి కాన్సర్ కారక సమస్యలు మనదరికి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఫినాలిక్ ఆసిడ్స్ ఫ్లేవనాయిడ్స్, టానిన్స్ వలన ఇందులో యాంటీ-ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే రాగులను మన రోజువారి డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం.


No comments

Powered by Blogger.