Latest

Loading...

Heavy Rains Alert : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్....!

Heavy Rains Alert

 Heavy Rains in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రమంతా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.


పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా భారీగా వర్షాలు కురవనున్నాయి. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.





No comments

Powered by Blogger.