High blood pressure Tips హై బీపీ ఉన్నవాళ్లు ఉప్పుకి బదులు వీటిని వాడవచ్చు...ఏమిటో తెలుసా....?
High blood pressure Tips
కూరలో ఉప్పు లేకపోతే రుచి ఉండదు రక్తపోటు అధికంగా ఉన్నవారు ఉప్పు తక్కువగా తినమని డాక్టర్స్ చెబుతుంటారు. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రావడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది దాంతో శరీరం బలహీనం అవుతుంది. శరీరం బలహీనం అయితే బ్యాక్టీరియా వైరస్ ఎటాక్ చేస్తాయి వాటి మీద పోరాటం చేసే శక్తిని కోల్పోతాం. .
రక్త పోటు రాకుండా ముందు జాగ్రత్త కోసం ఉప్పుకు బదులు కొన్ని రకాల పదార్థాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వంటలలో మిరియాల పొడి జీలకర్ర పొడి పుదీనా కొత్తిమీర వంటివి వాడి ఉప్పు తగ్గిందనే విషయం తెలియకుండా చేయవచ్చు. ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయలు అప్పడాలు వంటి వాటికి దూరంగా ఉండాలి
మనలో చాలా మంది వంట చేసేటప్పుడు ఉప్పును మొదట గాని చివరగా గాని వేస్తూ ఉంటారు.ఉప్పును చివర్లో వేస్తేనే ఆ పదార్థం ఉప్పును తక్కువగా తీసుకుంటుంది. పొటాషియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు ఉన్నవారు జీవితకాలం మందులు వాడవలసిందే.
No comments