Latest

Loading...

Home Remedies For Cockroach Control. ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా. ఇలా చేస్తే అసలు కనిపించవు..

Home Remedies For Cockroach Control

 Home Remedies For Cockroach Control

 సాధారణంగా ఏదో ఒక సమయంలో ప్రతి ఇంటిలోనూ బొద్దింకలు కనబడుతూ ఉంటాయి ఎక్కువగా వంటగది కబోర్డ్స్ లో ఉంటాయి ఇవి బ్యాక్టీరియాకు వాహకాలుగా ఉంటాయి మనం పడేసే ఆహారాన్ని తింటూ బతుకుతాయి ఇవి చాలా తక్కువ సమయంలోనే సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి మనకు చాలా అసౌకర్యానికి గురి చేస్తాయి.ఇంటి చిట్కాల ద్వారా బొద్దింకలను తరిమికొట్టొచ్చు


బేకింగ్ సోడా లో పంచదార కలిపి బొద్దింకలు ఉండే ప్రదేశంలో చల్లాలి. బొద్దింకలకు చక్కెర అంటే చాలా ఇష్టం కానీ దానిలో కలిపిన బేకింగ్ సోడా ను బొద్దింకలు జీర్ణం చేసుకోలేక చనిపోతాయి


బొద్దింకలు కాఫీ వాసనకు చాలా సులభంగా ఆకర్షితం అవుతాయి.


అయితే కాఫీ రుచి చూసిన తర్వాత కాఫీలో ఉండే కెఫిన్ చంపుతుంది అందువల్ల. బొద్దింకలు ఉన్న ప్రదేశంలో కాఫీ పొడి జల్లితే బొద్దింకలు పోతాయి


పుదీనా కూడా బొద్దింకలను తరిమికొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది పుదీనా ఆకులను బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెట్టవచ్చు.


బొద్దింకలు ఉల్లి వెల్లుల్లి వాసనను అస్సలు భరించలేవు. అందువల్ల ఉల్లిపాయ, వెల్లుల్లి కొన్ని మిరియాలు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని బొద్దింకలు ఉన్న ప్రదేశంలో spry చేస్తే పారిపోతాయి.

No comments

Powered by Blogger.