ICICI:ఆగస్టు నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఛార్జీలు...!!
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు నుంచి కొత్త ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా నగదు ఉపసంహరణ, చెక్ బుక్ లీవ్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించిన సేవలకు వసూలు చేసే ఛార్జీలను సవరించింది.
ఆర్థిక లావాదేవీలు..
ఒక నెలలో గరిష్ఠంగా నాలుగు నగదుతో కూడిన లావాదేవీలు(జమ+ఉపసంహరణ) ఉచితంగా జరిపేందుకు బ్యాంకు అవకాశం ఇచ్చింది. అనంతరం ప్రతి అదనపు లావాదేవీపై రూ.150 ఛార్జీ వర్తిస్తుంది. ఇక హోంబ్రాంచిలో ఒక నెలలో గరిష్ఠంగా రూ.లక్ష వరకు లావాదేవీలు(జమ+ఉపసంహరణ) జరపొచ్చు. నాన్ హోంబ్రాంచిలో రోజుకి రూ.25 వేల లావాదేవీల వరకు ఉచితం.
ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.150 వసూలు చేస్తారు.
నాన్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో లావాదేవీలు..
ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నాన్ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో జరిపే తొలి మూడు లావాదేవీలు(ఆర్థిక+ఆర్థికేతర) ఉచితం. ఇతర ప్రాంతాల్లో తొలి ఐదు లావాదేవీలు ఉచితం. తర్వాత ప్రతి అదనపు ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేతర లావాదేవీకి రూ.8.50 ఛార్జీ వర్తిస్తుంది.
చెక్‌బుక్..
ఏడాదికి 25 లీవ్స్ కలిగిన చెక్‌బుక్‌ను బ్యాంకు ఉచితంగా అందజేస్తుంది. తర్వాత పది చెక్ లీవ్స్ కలిగిన ప్రతి అదనపు చెక్బుక్కు రూ.20ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఎంఏబీ సరిగా మెయింటెన్ చేయకపోతే..
నెలవారీ కనీస సగటు బ్యాలెన్స్(మంత్లీ మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్-ఎంఏబీ) ఖాతాలో సరిగా మెయింటెన్ చేయనట్లైతే బ్యాంకు బ్రాంచి లేదా బ్యాంక్ క్యాష్ రీసైక్లర్ మెసీన్లలో జరిపే తొలి రెండు ఉచిత ఆర్థిక లావాదేవీలకు రూ.100ల రుసుము వసూలు చేయనున్నారు. తర్వాత జరిపే ప్రతి అదనపు లావాదేవీకి రూ.125లు రుసుము వర్తిస్తుంది.
No comments