Latest

Loading...

ICSE, ISC Results: 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజే విడుదల ...!!

ICSE, ISC Results

 ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ 10, 12వ తరగతి ఫలితాలు  (జులై 24) విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొంది. విద్యార్థులు cisce.org లేదా results.cisce.orgలో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఫలితాలు, వారికి వచ్చిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వివరిస్తూ వారి పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 మాత్రమే గడువు ఇస్తున్నట్లు CISCE కార్యదర్శి జెర్నీ అరాథూన్‌ వెల్లడించారు.


పాఠశాలలు కూడా విద్యార్థుల ఫలితాలను ఐసీఎస్‌ఈ పోర్టలోని Careers విభాగం నుంచి పొందవచ్చని పేర్కొన్నారు.


ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న నేపథ్యంలో ఐసీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వీటిని ప్రకటించనున్నారు. నిష్పాక్షిక, పారదర్శక విధానంలో విద్యార్థుల ప్రతిభను మదింపు వేసి ఫలితాలను ప్రకటిస్తామని బోర్డు ఇదివరకే వెల్లడించింది. ఇక సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించేందుకు CBSE బోర్డు కసరత్తు చేస్తోంది.

No comments

Powered by Blogger.