Latest

Loading...

Infosys గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్‌.. 35వేల మంది కొత్త వారిని నియమించుకోనున్న ఇన్ఫోసిస్‌..

Infosys

 దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా పేరుగాంచిన ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 35వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనుంది. ఈ మేరకు ఆ కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. డిజిటల్ టాలెంట్‌కు డిమాండ్ పెరుగుతుందని, అందుకనే కొత్త వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని ఆ కంపెనీ తెలియజేసింది. ఈ మేరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు వివరాలను వెల్లడించారు.


కరోనా సమయంలో ఉద్యోగులను ఆరోగ్యంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. అందుకు గాను వ్యాక్సినేషన్ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. అలాగే కెరీర్‌లో ఉద్యోగులు మరింత ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.


వారు తమ స్కిల్స్ ను మెరుగు పరుచుకునేందుకు పలు యాక్టివిటీలను ప్రారంభించినట్లు తెలిపారు.


కాగా జూన్ 2021తో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ రూ.5,195 కోట్ల లాభాలను చవిచూసింది. ఈ క్రమంలో ఇదే త్రై మాసికంలో ఆ కంపెనీ ఆదాయం రూ.27,896 కోట్లకు పెరిగింది. జూన్ నెలతో ముగిసిన త్రై మాసికానికి ఆ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌పై సంతకాలు చేసింది. ఈ క్రమంలోనే 23.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఇన్ఫోసిస్ కొత్త వారికి అవకాశాలను కల్పించడం, అందులోనూ ఈ ఏడాది చివరి వరకు వారిని నియమించుకోనుండడం శుభ పరిణామనని విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments

Powered by Blogger.