Kappa COVID-19: దూసుకొస్తున్న కప్పా వేరియంట్.. ఇది మరింత డేంజర్.. తస్మాత్ జాగ్రత్త...!!
మొన్నటిదాకా సెకండ్ వేవ్ అతలాకుతలం చేసింది. డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగించింది. భారత్‌లోనే కాదు అనేక దేశాల్లో ఇతర కరోనా వైరస్ రకాలతో పోల్చితే ఈ డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది. అయితే, కరోనా వైరస్ ఎప్పటికప్పుడు మ్యూటంట్ అవుతూ కొత్త రూపం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో రెండు కరోనా పాజిటివ్ కేసుల్లో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దీన్ని కప్పా వేరియంట్ అని పిలుస్తున్నారు. ఇది త్వరగా వ్యాపించే లక్షణమున్న వేరియంట్ అని భావిస్తున్నారు.
లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్‌ను నిర్ధారించారు.
ఈ కప్పా వైరస్ సోకిన ఇద్దరు వ్యక్తులు ఒకరు మరణించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 66 ఏళ్ల వృద్ధుడు కప్పా వైరస్‌కు బలయ్యాడు. సదరు వృద్ధుడు మే 27న కరోనా బారిన పడ్డాడు.
జూన్ 12న మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. అదే నెల 13న మళ్లీ శాంపిల్స్ సేకరించారు వైద్యులు. శాంపిల్స్ సేకరించిన మరుసటి రోజే వృద్ధుడు చనిపోయాడు. ఈ శాంపిల్‌ను ఢిల్లీలోని CSIR ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి పంపగా.. కప్పా వైరస్‌గా కన్ఫామ్ అయింది.
కరోనా కొత్త వేరియంట్ గురించి అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సమాచారం అందించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ హెల్త్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ, కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. దీనికి చికిత్స అందుబాటులో ఉందని వివరించారు.
No comments