Latest

Loading...

Lemon water Benefits : నిమ్మకాయ నీటిని ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా...!!

Lemon water Benefits :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనలో చాలా మంది ప్రతిరోజు నిమ్మకాయ నీటిని తాగుతున్నారు. నిమ్మకాయ నీటిని తాగితే అలసట నీరసం నిస్సత్తువ వంటివి తొలగిపోయి చురుకుగా హుషారుగా ఉంటారు. మనలో చాలా మంది ఉదయం పరగడుపున నిమ్మకాయ నీటిని తాగుతూ ఉంటారు కొంతమంది రాత్రి సమయంలో తాగుతూ ఉంటారు.


అయితే ఏ సమయంలో తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. నిమ్మకాయ నీటిని ఉదయం సమయంలో తాగితే డీహైడ్రేషన్ కి గురికాకుండా శరీరానికి శక్తి లభించి నీరసం అలసట లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది దాంతో శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది దాంతో బరువు తగ్గుతారు.

రాత్రి సమయంలో నిమ్మకాయ నీటిని తాగితే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అధిక బరువు సమస్య తొలగిపోతుంది శరీరంలో ఏమైనా వాపులు ఉంటే తగ్గిపోతాయి.

No comments

Powered by Blogger.