Latest

Loading...

LIC : సూపర్ పాలసీ.. రూ.25 పొదుపుతో రూ.5 లక్షలు..?

Lic

 దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ పాలసీలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కుటుంబ ఆర్థిక భద్రతతోపాటు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలతో పాటు అందరికీ ప్రయోజనం చేకూరేలా ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయి.


ఎల్ఐసీ అందించే పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి కాగా ప్రతి నెలా ఈ పాలసీలో 800 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. రోజుకు కేవలం 25 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 8 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.


పాలసీ టర్మ్ మూడు రకాలుగా ఉండగా నచ్చిన టర్మ్ ను ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎంచుకునే ఆప్షన్ ప్రాతిపదికన ప్రీమియం, మెచ్యూరిటీ బెనిఫిట్స్ మారే అవకాశం అయితే ఉంటుంది. 16 ఏళ్ల టర్మ్‌కు పది సంవత్సరాలు, 21 ఏళ్ల టర్మ్ కు 15 సంవత్సరాలు, 25 ఏళ్ల టర్మ్ కు 16 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 30 సంవత్సరాల వయస్సులో 25 ఏళ్ల టర్మ్ తో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ తీసుకుంటే మంచిది.


2 లక్షల రూపాయల బీమా మొత్తానికి పాలసీని తీసుకుంటే నెలకు దాదాపు రూ.777 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఆదా చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది.


No comments

Powered by Blogger.