Latest

Loading...

LIC ఎల్‌ఐసీ అదిరే పాలసీ.. రూ.30 పొదుపుతో రూ.4 లక్షలు పొందే ఛాన్స్..?

Lic

 దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. మహిళల కొరకు ఎల్‌ఐసీ స్పెషల్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ శిలా పాలసీ పేరుతో ఈ పాలసీ అమలవుతుండగా ఈ పాలసీ వల్ల ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. 8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుంది

ఈ పాలసీ తీసుకోవడం ద్వారా రాబడితో పాటు రక్షణ పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు మెచ్యూరిటీ కాలం తర్వాత డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. పాలసీ గడువులోగా మరణిస్తే కుటుంబం బీమా డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. కనీసం 75వేల రూపాయలకు ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు ఈ పాలసీని కచ్చితంగా తీసుకోవాలి.

పాలసీ టర్మ్ 10 నుంచి 20 సంవత్సరాల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎండోమెంట్ ప్లాన్ కాగా ఈ పాలసీ ద్వారా బోనస్ లభించడంతో పాటు ప్రీమియంను పొందే అవకాశం ఉంటుంది. 31 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు 20 సంవత్సరాల కాలపరిమితితో పాలసీని తీసుకుంటే సంవత్సరానికి 10,900 వరకు ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది.


రోజుకు 29 రూపాయలు పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ కాలం తర్వాత ఏకంగా 4 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. మహిళలు ఈ పాలసీని తీసుకుంటే బెస్ట్ అని చెప్పవచ్చు.


No comments

Powered by Blogger.