Latest

Loading...

Mask మాస్క్ ధరించకుంటే వంద ఫైన్ తెలుసా...!!

Mask

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కరోనా కేసులు, వ్యాక్సినేషన్ తదితర విషయాలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నానితో పాటుగా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణంలో పనిచేసే వ్యక్తులు, వినియోగదారులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని తెలిపారు. మాస్క్ లేకుంటే రూ.100 జరిమాన విధించాలని ఆదేశించారు. అవసరమైతే కొన్ని రోజులపాటు దుకాణాలు మూసివేసేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించారు.


రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు.


రాత్రి 9 వరకు దుకాణాలు మూసివేయాలని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అన్నారు. సడలింపుల సమయంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. మాస్క్ పెట్టుకొకుండా తిరిగేవారిని గుర్తించేందుకు వాట్సప్ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా మాస్క్ పెట్టుకొనని వ్యక్తి ఫొటోను వాట్సప్‌కు పంపితే వారికి జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు

No comments

Powered by Blogger.