Latest

Loading...

Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధులను నివారణకు ఈ 5 ఆహారాలు కచ్చితంగా మీ డైట్‌లో ఉండాల్సిందే.....!!

Monsoon Diet

 Monsoon Diet 

వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముసలివారికి, చిన్న పిల్లలకు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే బలవర్దకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ జ్వరం లాంటి వ్యాధులు సంభవించినా శరీరం తట్టుకునే విధంగా ఉండాలి. అందుకోసం ఈ ఐదు ఆహార పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకోవడం మరిచిపోవద్దు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.


1. వోట్స్- వోట్స్ ఇష్టమైన అల్పాహారం. ఇది జీర్ణించుకోవడం చాలా సులభం. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు దీనిలో పండ్లను కూడా చేర్చుకోవచ్చు. ఇందులో అరటి, బ్లూబెర్రీ, జీడిపప్పు మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. ఇది వోట్స్‌ను మరింత పోషకమైనదిగా చేస్తుంది.


2. పుట్నాలు- పుట్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి మీరు వీటిని తినవచ్చు.


3. రుతుపవనాలలో ఎక్కువ కొవ్వు గల ఆహారం తినడానికి బదులుగా మీరు ఫ్రూట్ చాట్ తినవచ్చు. మరింత రుచికోసం ఉప్పు, మిరియాలు కలుపుకోవచ్చు.


4. డ్రై ప్రూట్స్ – జీడిపప్పు, బాదం తినడం ప్రతి సీజన్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీరు వాటిని వర్షాకాల డైట్‌లో చేర్చవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.


5. అవోకాడో, అరటి స్మూతీ – అవోకాడో, అరటిని గ్రైండర్‌లో ఉంచండి. దీనికి 3 చెంచాల తేనె, 1 కప్పు చల్లటి పాలు వేసి కలపాలి. తర్వాత తీసుకొని తాగండి. ఇది చాలా బలవర్దకమైన ఆహారం.

No comments

Powered by Blogger.