Latest

Loading...

57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ : సీఎం కేసీఆర్...!!

Pention


వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని..గొర్రెల పంపిణీ కి ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లు బతికి ఉన్నప్పుడే తెలంగాణ రాకముందు మిషన్ భగీరథ పథకం పై చర్చించామని తెలిపారు.

సన్యాసులకు ఎప్పుడు అనుమానాలు ఉంటాయని. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారని చురకలు అంటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎన్ని వేల కోట్లు కరెంట్ బిల్లు కడతారని సన్యాసులు ప్రశ్నిస్తున్నారని. 10 వేల కోట్లు అయినా కట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం తో పాటు.. రైతుల ఇంట్లో బంగారు వర్షం కురిపించేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తామని ప్రకటించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని అకుంఠిత దీక్షతో చేయాలని. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ లకు సైతం నిధులు ఇస్తున్నామన్నారు. సిరిసిల్ల సిరుల జిల్లాగా మారిందని.ఈ నెల 10 తర్వాత రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.

No comments

Powered by Blogger.