Physical Activity : అధిక వ్యాయామం ఆరోగ్యానికి హానికరమే....!!.
Physical Activity : ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు చాలా మంది క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటారు. వ్యాయామం చేయటం వల్ల కండరాలు ఉత్తేజితం కావటంతోపాటు, మానసిక ప్రశాంతతోపాటు, రోగ నిరోధ శక్తి కూడా బాగా పెరుగుతుంది. ప్రధానంగా రక్త ప్రసరణ వ్యవస్ధ మెరుగవుతుంది. అయితే వ్యాయామం చేయటానికి కొన్నిపరిమితులు ఉన్నాయి. పరిమిత సమయాన్ని మించి వ్యాయామాలు చేయటం ఆరోగ్యానికి మేలు కలగకపోను హానికరంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
అధికంగా వ్యాయామం చేసే వారిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి వారు ఎక్కువ శక్తిని కోల్పోవటం, కాళ్ళు, ఒంటి నొప్పులు బాధించటం, కండరాలు పట్టుకుపోవటం, విపరీతమైన తలనొప్పి, ఒత్తిడికి లోనై చికాకు పడటం వంటి లక్షణాలతో బాధపడతారని నిపుణులు తేల్చారు.
ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తే సరిపోతుంది. అలా కాకుండా గంటల తరబడి జిమ్ లో గడిపేవారు రిస్కులో పడే ఛాన్స్ అధికంగా ఉంటుందట.
రోజు ఎక్సర్ సైజులు చేయలేని వారు వారంతాలలో కనీసం గంట సమయం వ్యాయామానికి కేటాయించాలి. అలాగే ప్రతిరోజు ఎక్సర్ సైజులు చేసేవారు వారంతంలో వ్యాయామానికి విరామం ఇవ్వటం ఉత్తమం. వ్యాయామాలు చేస్తూ అలసటతో బాధపడుతున్న వారు తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవటం ఉత్తమం. సరైన పద్దతి వ్యాయామాలు చేయటం వల్ల ఆరోగ్యంగా జీవితాన్ని దీర్ఘకాలం గడిపేందుకు అవకాశం ఉంటుంది.
No comments