Latest

Loading...

Post office : పోస్టాఫీస్‌ స్కీమ్...ప్రతి నెలా రూ.2 వేలు..!!

Post office

 పోస్టాఫీస్ ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ లేకుండానే రాబడి పొందొచ్చు. మీరు ఎంచుకునే పథకం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు ఏ స్కీమ్ ఎంచుకుంటారనేది ముఖ్యమైన అంశం. పోస్టాఫీస్ అందించే పథకాల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ MIS కూడా ఒకటుంది. ఇందులో చేరితే ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి. ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. తర్వాత ప్రతి నెలా ఈ డబ్బుపై వడ్డీ వస్తూనే ఉంటుంది. పదేళ్ల వయసు దాటిన పిల్లలను కూడా మీరు ఈ స్కీ్మ్‌లో చేర్పించొచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు.

మీరు రూ.2 లక్షలు డిపాజిట్ చేసి ఈ పథకంలో చేరితే మీకు నెలకు రూ.1100 వస్తాయి. అంటే మీకు ఐదేళ్లలో రూ.66 వేల వరకు వడ్డీ రూపంలో లభిస్తాయి. అదే మీరు రూ.3.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీకు నెలకు దాదాపు రూ.2 వేలు వస్తాయి. ఈ డబ్బులతో మీరు పిల్లల ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చు. ఇతర ఖర్చులకు వినియోగించుకోవచ్చు. అదే రూ.4.5 లక్షలు పెడితే రూ.2,500 వరకు పొందొచ్చు.

No comments

Powered by Blogger.