Rain Alert : నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు...!!!
వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పు-పడమర ద్రోణి ఉత్తర అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శనివారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. కాగా మధ్యాహ్న సమయంలో చాలా ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపింది.
No comments