Latest

Loading...

SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎస్‌బీఐలో 6100 జాబ్స్... అప్లై చేయండి ఇలా...!!

SBI Jobs 2021


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దేశవ్యాప్తంగా 6100 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఇవి ఒక ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 జూలై 26 లోగా దరఖాస్తు చేయాలి. 2021 ఆగస్ట్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/ careers లేదా https://nsdcindia.org/apprenticeship లేదా https://apprenticeshipindia.org లేదా http://bfsissc.com వెబ్‌సైట్లలో అప్లై చేయొచ్చు. అప్లై చేసేముందు నోటిఫికేషన్, ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.

మరి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

 SBI Apprentice Recruitment 2021: అప్లై చేయండి ఇలా



అభ్యర్థులు పైన ఉన్న వెబ్‌సైట్లలో ఏదైనా ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

కెరీర్స్ లేదా రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో ఉన్న నోటిఫికేషన్ చదవాలి.

అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేయడానికన్నా ముందు యాక్టీవ్‌లో ఉన్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ సిద్ధంగా ఉంచుకోవాలి.

అప్లై ఆన్‌లైన్ పైన క్లిక్ చేసి అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ ఇతర వివరాలతో రిజిస్టర్ చేయాలి.

విద్యార్హతలు, మరిన్ని వివరాలు ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. ప్రింట్ ఔట్ కాపీని ఎస్‌బీఐకి పంపాల్సిన అవసరం లేదు.


అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా, నోటిఫికేషన్‌కు సంబంధించి ఇతర సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్‌ని సంప్రదించొచ్చు. 022-22820427 నెంబర్‌కు వర్కింగ్ డేస్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కాల్ చేయొచ్చు. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS క్యాండిడేట్ గ్రీవియెన్స్ రిడ్రస్సల్ సిస్టమ్‌ పోర్టల్ http://cgrs.ibps.in ఓపెన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. సబ్జెక్ట్‌లో 'Engagement of

Apprentice in SBI' అని రాయడం మర్చిపోవద్దు.


No comments

Powered by Blogger.