SBI New Personal Loan: కరోనా కష్టకాలంలో కస్టమర్లకు అండగా ఎస్బీఐ.. ష్యూరిటీ లేకుండానే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్...!!
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తమ కస్టమర్ల కోసం కొత్త రకం పర్సనల్ లోన్లను అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి ష్యూరిటీ పెట్టుకుండానే ఈ లోన్లను మంజూరు చేస్తుండటం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా కస్టమర్లకు ఆర్థిక చేయూత అందించేందుకు 'కవచ్ పర్సనల్ లోన్' పేరుతో ఈ పర్సనల్ లోన్లను ప్రారంభించింది. ఎస్బీఐ కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటుకే, జీరో ఛార్జీలతో ఈ లోన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. కవచ్ పర్సనల్ లోన్ కింద కస్టమర్లు రూ .25 వేల నుండి రూ .5 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ లోన్‌కు దరఖాస్తు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి
అవేంటో పరిశీలించండి.
కవచ్ పర్సనల్ లోన్ ప్రయోజనాలివే..
1. కరోనా వైరస్ చికిత్స కోసం ఎటువంటి ష్యూరిటీ లేకుండానే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తోంది ఎస్బీఐ. రుణగ్రహీతకు సంబంధించిన వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని రూ .25 వేల నుండి రూ .5 లక్షల మధ్య లోన్ మంజూరు చేస్తుంది.
2. కవాచ్ పర్సనల్ లోన్ కింద తీసుకునే రుణాలకు 8.5% వార్షిక వడ్డీ రేటు మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ అందిస్తుండటం గమనార్హం. అంతేకాదు, ఈ లోన్లకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. జప్తు ఛార్జీలు, జరిమానాలను కూడా ఎస్బిఐ మాఫీ చేసింది.
3. ఎస్బీఐ అందజేస్తున్న కవాచ్ పర్సనల్ లోన్ 5 సంవత్సరాల వ్యవధి కలిగి ఉంటుంది. అంతే, 60 నెలల్లోగా తీసుకున్న రుణాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. లోన్ తీసుకన్న వారు మొదటి మూడు నెలల పాటు ఎటువంటి ఈఎంఐలను చెల్లించాల్సిన అవసరం లేదు.
4. శాలరీ పొందేవారు, పొందని వారు, పదవీ విరమణ చేసినవారు, వారి కుటుంబ సభ్యులు ఈ కొత్త వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
5. ఈ పర్సనల్ లోన్ కేవలం కరోనా చికిత్స కోసం ఉద్దేశించి ప్రారంభించారు. కాబట్టి, లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో కస్టమర్లు తమ డాక్యుమెంటేషన్‌లో కోవిడ్--19 పాజిటివ్ రిపోర్ట్‌ను కూడా బ్యాంకుకు సమర్పించాలి.
6. 2021 ఏప్రిల్ 1న లేదా ఆ తరువాత కోవిడ్--19 పాజిటివ్ వచ్చిన వారు మాత్రమే ఎస్బిఐ కవాచ్ పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
7. వినియోగదారులు వారి దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించడం ద్వారా లేదా ఎస్బీఐ యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ని ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు.
8. లోన్ విజయవంతంగా మంజూరైన తర్వాత ఆ మొత్తం కస్టమర్ శాలరీ, పెన్షన్ లేదా సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది.
9. కోవిడ్-19 సంబంధిత వైద్య ఖర్చుల కోసం, ఇప్పటికే చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడం కోసం కరోనా కవచ్ లోన్‌ను ప్రారంభించినట్లు SBI ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్లిష్ట సమయాల్లో కస్టమర్లకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ఎస్బీఐ ఎప్పుడూ ముందుంటుందని తెలిపింది.
10. ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ "ఈ కష్ట సమయంలో మా కస్టమర్లు ఆర్థిక భరోసా కల్పించడమే మా లక్ష్యం.- దురదృష్టవశాత్తు ఎవరైనా కరోనా బారిన పడితే వారి చికిత్స కోసం అత్యవసరంగా నిధులు సమకూర్చడం కష్టమవుతుంది. అందుకే వారి అవసరాలను తీర్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాం' అని అన్నారు
No comments