Tea Side effects టీ ఎక్కువగా తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం....?
మనలో చాలామంది టీ తాగడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మనల్ని ఉత్సాహంగా ఉంచడంలో, అలసటను తగ్గించడంలో టీ ఎంతగానో సహాయపడుతుంది. కొంతమంది రోజుకు రెండుసార్లు టీ తాగితే మరి కొందరు మాత్రం ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. టీ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. టీ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, మంటను తగ్గించడం, గుండెజబ్బుల రిస్క్ తగ్గడం, ఇతర ప్రయోజనాలు చేకూరుతాయి.
అయితే టీ మితంగా తాగితే ఏ ఇబ్బంది లేకపోయినా ఎక్కువసార్లు తాగితే మాత్రం ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా టీ తాగేవాళ్లలో నిద్రకు ఆటంకం కలుగుతుంది. వేడి టీ తాగడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఒక కప్పు టీ 150 డిగ్రీల ఫారెన్ హీట్లో ఉంటే 127 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు అన్నవాహిక ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. రక్తహీనత, ఐరన్ లోపంతో బాధ పడేవాళ్లు టీ తాగితే ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. టీలో లభించే టానిన్లు ఐరన్ శోషణకు కారణమవుతుంది కాబట్టి పరిమిత మొత్తంలో టీ తాగితే మంచిదని చెప్పవచ్చు. బ్లాక్ టీ, గ్రీన్ టీ శరీరంలో అసమతుల్యత, నిర్జలీకరణానికి కారణమయ్యే అవకాశాలు ఉంటాయి.
టీ ఎక్కువగా తాగడం వల్ల హృదయ స్పందన సరిగ్గా లేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు పరిమితంగా టీ తాగడం లేదా నెమ్మదిగా ఆ అలవాటును తగ్గించుకోవడం చేస్తే మంచిది.
No comments