Latest

Loading...

Third wave: ఏపీలో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్..... కండిషన్స్ అప్లై...!!

Third wave

 Theatres reopening ahead of Corona third wave: అమరావతి: ఏపీలో థియేటర్లలో సినిమా చూడాలని ఎదురుచూస్తున్న ఆడియెన్స్‌కి, థియేటర్లలో మాత్రమే తమ సినిమాను విడుదల చేద్దామని వేచిచూస్తున్న సినిమా వాళ్లకు సర్కారు గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. ఈనెల 30 నుంచి ఏపీలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటిస్తూనే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది.


కరోనావైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో థియేటర్లు దాదాపు ఏడాదిన్నరకుపైగా మూతపడే ఉన్నాయి. మధ్యలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ..


50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల నిర్వహణ తలకు మించిన భారం అవుతుందని సగానికిపైగా థియేటర్ల యజమానులు థియేటర్లు తెరిచేందుకు ముందుకురాలేదు. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) రావడంతో తెరిచిన కొద్ది థియేటర్లు కూడా మళ్లీ మూతపడ్డాయి.


ఇదిలావుంటే, ఆగస్టు 2వ వారం నుంచి కరోనా థర్డ్ వేవ్ కేసులు (COVID-19 third wave) పెరగొచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా థియేటర్లు తెరిచేందుకు యజమానులు ఏ మేరకు ఆసక్తి చూపిస్తారోననేది వేచిచూడాల్సిందే

No comments

Powered by Blogger.