Latest

Loading...

Triphala Churna: వంద రోగాలకు ఒక్కటే ఔషధం త్రిఫల చూర్ణం...దీనిని ఎవరు, ఎలా ఉపయోగించాలంటే.....!!!

Triphala Churna


Triphala Churna: త్రిఫల చూర్ణం ఆయుర్వేద ఔషధం. తరతరాలనుండి మనకు వారసత్వంగా లభిస్తున్న మరొక సర్వరోగ నివారిణి.. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బైయోటిక్ అని చెప్పవచ్చు.. మన శరీరాన్ని శుభ్రం చేయడంతో మనకు ఎంతగానో ఉపకరించే ఔషధం ఈ త్రిఫల చూర్ణం.. ఉసిరి,కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫలా చూర్ణం. త్రిఫలా చూర్ణాన్ని త్రిదోష రసాయనం అని అంటారు.


ఇందులో ఉన్న ఉసిరికి చలువచేసే గుణం ఉంది.. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.


ఈ మూడు కలిసిన ఈ త్రిఫల చూర్ణం మానవశరీర ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది.


వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. అందుకనే ఈ త్రిఫల చూర్ణాన్ని నేటికీ అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు.


ఈ చూర్ణం క్రమం తప్పకుండా తీసుకుంటే ఋతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. ఋతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడడం మంచిది. త్రిఫలా చూర్ణం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. కళ్ళు, చర్మ ఆరోగ్యానికి మంచిది. త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు క్రమం తప్పక తీసుకుంటే, జుట్టు అంత త్వరగా తెల్లగా మారదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీని ప్రభావం వల్ల ముసలితనం త్వరగా రాదు. జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడంలో త్రిఫల చూర్ణం చక్కగా ఉపకరిస్తుంది. ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది. అంతేకాదు.. వాతం నొప్పులతో బాధపడే వారు.. కరక్కాయ లోనుంచి గింజలు తీసివేసి, మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి, 60 గ్రాముల మెత్తని సైందవ లవణాన్ని కలిపి, మజ్జిగతో తీసుకోవాలి.. ఇలా చేస్తే.. వాతం నొప్పులు తగ్గుతాయి.


త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. త్రిఫలా చూర్ణాన్ని ఎక్కువ రోజులు వాడితే శరీరం దానికి అలవాటు పడుతుంది. అది మంచిది కాదు. త్రిఫలాలో వాడే కరక్కాయ చాలా శక్తివంతమైనది. అయితే దీనిని ఉపవాసం ఉన్నవారు, గర్భిణులు, శరీరంలో పిత్త దోషగుణం ఉన్నవారు వాడకూడదు

No comments

Powered by Blogger.