Turmeric Side Effects : పసుపు అతిగా వాడితే అనర్ధాలు తప్పవా? నిపుణులు ఏం చెబుతున్నారంటే...!!
Turmeric Side Effects : భారతీయ సంస్కృతి సాంపద్రాయాల్లో పసుపుకు అగ్రస్ధానం ఉంటుంది. పసుపును శుభసూచికంగా భావిస్తుంటారు. అలాంటి పసుపులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. జలుబును తగ్గించటం, గాయాలు మాన్పటం వంటివాటికి చక్కని పరిష్కారంగా గృహచిట్కా వైద్యాల్లో పసుపును వినియోగిస్తుంటారు. చిన్నచిన్న వైద్య చిట్కాలకు కొద్ది మొత్తంలో పసుపును ఉపయోగించటం వల్ల పెద్దగా ఇబ్బంది ఏమి లేకపోయినప్పటికీ, పసుపును అతిగా వినియోగించటం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కరోనా మహమ్మారి రాకతో ఇటీవలి కాలంలో పసుపు బాగా ప్రాచుర్యం పొందింది. పసుపుతో కరోనాను ఎదుర్కోవచ్చన్న ప్రచారం ఊపందుకోవటంతో చాలా మంది పసుపును మోతాదుకు మించి వంటలతో పాటు, ఆవిరి పట్టే సమయంలో వినియోగిస్తున్నారు.
వివిధ రకాల ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు పసుపు చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుందన్న మాట వాస్తమే. పసుపులో కర్య్కుమిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మానవ శరీరంలోని అనారోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటంతో క్యాన్సర్ వంటి వ్యాధులను సైతం దరి చేరనీయదని అంటుంటారు.
అయితే మోతాదుకు మించి వాడటం మాత్రం ప్రమాదకరమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపును ఎక్కువగా వాడటం వల్ల అందులో ఉండే స్టోయికియోట్రిక్ వల్ల శరీరంలోని ఐరన్ కోల్పావాల్సి వస్తుందట. దీంతో రక్తం తయారీ సామర్ధ్యం తగ్గుంది. ఎక్కువ మొత్తంలో పసుపు తీసుకోవటం వల్ల శరీరంలో కొన్ని మార్పులు ప్రధానంగా తలనొప్పి, చర్మ ఎలర్జీలు, కడుపులో మంట, జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పుసుపులో ఉండే కర్క్యుమిన్ తో మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని అతిగా వాడటం వల్ల షుగర్, బిపితో బాధపడేవారు ఇబ్బందిపడక తప్పదు. రోజువారి ఆహారంలో 2వేల మిల్లీ గ్రాములకు మించి పసుపును తీసుకోకూడదు. మోతాదుకు మించి మాత్రం పసుపును వాడితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
No comments