Latest

Loading...

Ulavalu Health Benefits ఉలవల వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా ...?

 

Ulavalu Health Benefits

ప్రస్తుతం మనకు ఎన్నో రకాల అయినటువంటి పప్పు ధాన్యాలు దొరుకుతూ ఉన్నాయి. వాటి వల్ల ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇక అలాంటి వాటిలో ఉలవలు కూడా ఒకటీ, అయితే ఈ ఉలవలు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.


1). ఉలవలలో ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఇవి మంచి పోషకంగా పనికొస్తాయి.


2) ఉలవల్లో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉలవలను మొలక వచ్చిన తరువాత, వాటిని ఆరబెట్టి, వేయించడం వల్ల పోషకాలు సమృద్ధిగా పెరుగుతాయి.


3). ఉలవలను తినడం వల్ల ఎక్కువగా ఆకలి వేసేలా చేస్తుంది. కఫాన్ని అరికట్టడంలో ఎంతో సహాయపడుతుంది. కళ్ళల్లో నీరు కారుతున్నా, కంటి రెండు వైపులా పిసురు కడుతున్న వారికి ఉలవలు తినడం వల్ల అలాంటివి ఉండవు.


4). కిడ్నీ లోపల ఉండేటువంటి రాళ్లను బయటికి వచ్చే విధంగా ఇవి ఎంతగానో సహాయపడతాయి.


5). ఎక్కువ ఎక్కిళ్ళు వచ్చేవారు, మలబద్దక సమస్య ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల ఇవి తగ్గిపోతాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక.


6). ఉలవలను ఎక్కువగా ఉడకబెట్టుకొని, ఉలవచారు ను అయినా ఆహారంగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.


ఇప్పుడు ఉలవచారును ఎలా చేయాలో తెలుసుకుందాం.


ముందుగా ఒక కప్పు ఉలవలను తీసుకోండి. ఆ కప్పు ను ఒక గిన్నెలో పోసి, అందులోకి కొన్ని వాటర్ పోసి బాగా ఉడికించాలి. అలా వచ్చిన జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పూట ఏమీ తినకుండా, ఆ జ్యూస్ లోకి కొంచెం ఉప్పు వేసుకొని తాగడం వల్ల క్రమంగా సన్నబడతారు.


7). కాళ్ళ వాపులు, బోదకాలు ఉన్నవారు, ఉలవ పొడిని, ఒక పిడికెడు పుట్టమన్ను, కోడిగుడ్డులోని తెల్లసొనను తీసుకుని బాగా కలిపి కాళ్ళ వాపులు, బోదకాలు ఉన్న వారికి కాపాడం చేయడం ద్వారా దాని నుంచి విముక్తి పొందవచ్చు.


No comments

Powered by Blogger.