Latest

Loading...

Vaccine ఈ వ్యాక్సిన్ వేసుకుంటే 90% సేఫ్.. !



దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. కేవలం మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే కరోనాకు పలు వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో కరోనాను ఎదురుకునే సామర్థ్యాన్ని అంచనా వేసే పనిలో ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు. ఏ వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కువ రక్షణ లభిస్తుందని పరిశోధనలు జరుపుతున్నారు.


ఇక ఇప్పటికే పలు వ్యాక్సిన్ లపై పరిశోధనలు జరిపారు. తాజాగా ఫైజర్ మరియు మోడిర్నా వ్యాక్సిన్ పై కూడా ఈ ప్రయోగాలు జరిపారు. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకే చాన్స్ 91% తగ్గుతుందని అమెరికా సైంటిస్టులు తమ పరిశోధనలో వెల్లడైనట్టు చెబుతున్నారు.


వేసుకున్నాక రెండు వారాలకు 85% కరోనా బారిన పడే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా రెండో డోస్ వేసుకున్నాక రెండు వారాలకు 91% వ్యాధినిరోధకత ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


అనారోగ్యంతో బెడ్ కు పరిమితం అయ్యే రోజులు 60 శాతం తగ్గాయని వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న 2.7 రోజుల్లోనే వైరస్ లో 70 శాతం వరకు తగ్గుతుందని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా ఫైజర్ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. ఈ వ్యాక్సిన్ మన దేశంలో కూడా అందుబాటులో ఉంది.

No comments

Powered by Blogger.