vavili chettu మీ చుట్టుపక్కల ఉండే ఈ మొక్క మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుందని మీకు తెలుసా....!!!
vavili chettu upayogalu : మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి వాటిలో ఉన్న ప్రయోజనాలు మనకు తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తాము. అలాంటి మొక్కల గురించి మనం తెలుసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అలాంటి మొక్కలలో వావిలాకు ఒకటి. ఈ మొక్క పల్లెటూర్లలో ఉండే వారికి బాగా తెలుసు. వారు ఎక్కువగానే ఈ మొక్కను ఉపయోగిస్తారు.
కీళ్లనొప్పులను మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో వావిలాకు చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఒక శక్తివంతమైన ఆయుర్వేద మొక్క గా చెప్పవచ్చు. ఈ మొక్కలో ఉండే లక్షణాలు కండరాల నొప్పులు తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ మొక్కలో ఆకులు పువ్వులు పండ్లు బెరడు అన్ని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు.
వావిలి రూట్ మరియు బెరడు రసాలలో సమృద్ధిగా ఉండే ఆల్కలాయిడ్ నిషిండిన్,యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పులను తగ్గించే లక్షణాలు ఉండటం వలన ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పి కండరాల నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవటానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి వావిలిలో ఉండే విటమిన్ సి సహజ యాంటీబయోటిక్ లక్షణాలు సహాయపడతాయి.
విటమిన్ సి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలకు సహాయ పడటమే కాకుండా చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. ఆందోళన ఒత్తిడి వంటివాటిని తగ్గించి మెదడు యొక్క మెమొరీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే ఈ వావిలి మొక్కను ఉపయోగించే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదించి మంచిది. వావిలి ఆకులు వేసి, కాచిన నీటిలో స్నానం చేస్తే, వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది.
No comments