Weight Gain Tips: బక్కపలచగా ఉన్నారా...? ఈ ఐదింటిని తింటే బరువు పెరగడం పక్కా..!!
బరువు తగ్గడం కష్టం గానీ.. పెరగడం చాలా సులభమని అని చాలా మంది చెబుతారు. బక్కపలచగా ఉండేవారు తాము తినే ఫుడ్‌పై కాస్త శ్రద్ధ పెడితే.. ఈజీగా బరువు పెరగవచ్చు. జంక్ ఫుడ్ వంటివి తినకూడదు. హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఐదు ఆహార పదార్థాలను తినడం వల్ల బరువు పెరగవచ్చు
బాదంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఎవరైనా వీటిని తినవచ్చు. లాభాలే తప్ప నష్టాలు ఉండవు. అలాగని అదే పనిగా తినకూడదు. పరిమితంగానే తీసుకోవాలి. రోజుకు 4 నుంచి 5 బాదం పప్పులను తింటే శారీరక వృద్ధి పెరుగుతుంది
కొబ్బరి పాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ఇందులో విటమిన్స్, మినరల్స్‌తో పాటు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు తినే భోజనంలో కొబ్బరి పాలను వాడితే బరువు పెరుగుతారు
గుడ్డు మంచి పోషకాహాం. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డీతో పాటు మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ గుడ్డు తినడం వల్లే కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో మార్పు కనబడుతుంది. బరువు పెరుగుతారు.
బరువు పెరిగేందుకు చాలా మంది ఎంచుకునే ఆహారం అరటి పండు. బరువు పెరిగేందుకు ఇది ఉత్తమమైన మార్గం. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు పాలతో అరటి పండు తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
బ్రౌన్ రైస్‌లో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. పీచుపదార్థం కూడా బాగానే ఉంటుంది. అందుకే మీరు తినే ఆహారంలో బ్రౌన్ రైస్ చేర్చితే బరువు పెరిగే. అవకాశం ఉంది.
No comments