Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. .అయితే జీలకర్రను ఇలా ఉపయోగించండి..
బరువు అనేది ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ బరువుని తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటారు. దానికోసం రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అలా బరువు తగ్గాలని అనుకునే వారి కోసం ఒక టీ చక్కగా ఉపయోగపడుతుంది. వాము, జీలకర్రతో చేసిన ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. రోజూ ఆహరంలోకి జీలకర్ర తీసుకోవడంతోపాటు, వాటిని జ్యూస్ చేసి తాగడం వలన శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలువడింది. ఆ సంస్థ వారు 80 మంది మహిళలను రెండు గ్రూపులుగా విడదీశారు.
అందులో కొంత మంది జీలకర్రను ఉపయోగించగా.. మిగతావారు ఇతర డైట్ కంట్రోల్‌ను వాడారు. ఇందులో ఇతర డైట్ సిస్టంను వాడినవారి కంటే జీలకర్రను వాడినవారు బరువు తగ్గినట్లు తేలింది. దీనిని ఉపయోగించిన వారిక బరువు తగ్గడంతో పాటు.. రక్తం మొత్తం శుభ్రమవుతుంది. శరీరంపై ఉన్న ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
కంటి చూపు మెరుగవుతుంది. పళ్లు, చిగుళ్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగవుతుంది. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. దీనిని ఎలా తయారు చేస్తారంటే.. ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించాలి. వేడి చేసిన నీటిని వడకట్టి నాలుగు చుక్కలు నిమ్మరసం వేసుకుని తాగాలి. రుచి కోసం అల్లం లేదా పుదీనా ఆకులు కూడా కలుపుకోవచ్చు. నిమ్మ రసం రుచి నచ్చకపోతే ఒక టీస్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. కేవలం బరువు తగ్గడంలోనే కాకుండా ఈ వాము, జీలకర్ర టీతో ఇంకా చాలా రకాలు ప్రయోజనాలు ఉన్నాయి. వాము, జీలకర్ర పొడిని మూడు నెలల పాటు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు మల, మూత్ర, చెమట ద్వారా బయటకొచ్చేస్తాయి. దీంతో జీర్ణక్రియ సరిగా పనిచేస్తుంది.
జీలకర్ర రోజూ తినడం వల్ల బరువు తగ్గడం మాత్రం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. జీలకర్ర రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి పేగులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్ ఉండడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఐరన్ శక్తిని అందిస్తుంది. వీటితోపాటు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది. శరీరంలో మంటను తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక టీస్పూన్ జీలకర్రను ఒక టీస్పూన్ పెరుగుతో కలిపాలి. ఆ మిశ్రమాన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తినాలి. ఇలా కనీసం 15 రోజులు చేయడం వలన క్రమంగా బరువు తగ్గుతారు. రాత్రి సమయంలో జీలకర్రను నానబెట్టి.. ఉదయాన్నే మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. అందులో కాస్తా నిమ్మకాయ కలిపి తాగితే రుచి బాగుంటుంది. ఇలా 2 వారాల పాటు చేయడం వలన బరువు తగ్గుతారు. జీలకర్రను పైన చెప్పిన విధంగా టీగా గానీ, జ్యూస్ ద్వారా గానీ తీసుకోవచ్చు.
No comments