Latest

Loading...

Weight loss: బరువు తగ్గాలని భావిస్తున్నారా.... అయితే ఈ టీని మూడు నెలల పాటు తాగిచూడండి....?.

Weight loss

 ప్రతీ ఒక్కరికి బరువు అనేది ప్రమాదకరమే. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు సాధరణంగా వ్యాయామాలు చేయడం మంచిదని సలహాలు ఇస్తుంటారు. అయితే దానికోసం రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెడతారు. ఒకటి రెండు రోజులు చేయగానే బద్దకంతోనో, పని ఒత్తిడితోనో మధ్యలోనే మానేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గాలన్న కల.. కలగానే ఉండిపోతుంటుంది. అలా బరువు తగ్గాలని అనుకునే వారి కోసం ఒక టీ చక్కగా ఉపయోగపడుతుంది. వాము, జీలకర్రతో చేసిన ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. కేవలం బరువు తగ్గడంలోనే కాకుండా ఈ వాము, జీలకర్ర టీతో ఇంకా చాలా రకాలు ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


బరువు ఎక్కువగా ఉన్న వ్యక్తిలో కొవ్వుతో పాటు వ్యర్థ పదర్థాలు పేరుకుపోయి ఉంటాయి. వాము, జీలకర్ర పొడిని మూడు నెలల పాటు ప్రతిరోజు తీసుకోవడం వల్ల విషపదార్థాలు మల, మూత్ర, చెమట ద్వారా బయటకొచ్చేస్తాయి.


అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రక్తం మొత్తం శుభ్రమవుతుంది. అంతే కాకుండా శరీరంపై ఉన్న ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. దీని వల్ల ఇంకా ఎముకలు చాలా ధృడంగా తయారు అవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మన దరి చేరవు. కంటి చూపు మెరుగవుతుంది. పళ్లు, చిగుళ్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి. గతంలో తీసుకున్న ఆల్లోపతీ మందుల సైడ్ ఎఫెక్ట్‌ను కూడా తగ్గిస్తుంది. మలబద్ధక సమస్య ఎవరికైనా ఉంటే దీనిని తీసుకోవడం వల్ల అది కూడా తగ్గిపోతుంది. రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగవుతుంది. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వినికిడి సమస్యలు తగ్గుతాయి. మధుమేహం కూడా నియంత్రణలోకి వస్తుంది.


దీనిని ఇలా తయారు చేసుకోవాలి.. ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించాలి. వేడి చేసిన నీటిని వడకట్టి నాలుగు చుక్కలు నిమ్మరసం వేసుకుని తాగాలి. రుచి కోసం అల్లం లేదా పుదీనా ఆకులు కూడా కలుపుకోవచ్చు. నిమ్మ రసం రుచి నచ్చకపోతే ఒక టీస్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసిన దీనిని మనం మూ నెలల పాటు తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా దూరం అవుతాయి.


No comments

Powered by Blogger.