Latest

Loading...

Weight Loss: ఈ రైస్ తినండి.. ఈజీగా బరువు తగ్గండి...!!

Weight Loss

 జనరల్‌గా రైస్ తింటే... వాటిలో షుగర్ కారణంగా... బరువు పెరుగుతారని డాక్టర్లు చెబుతుంటారు. మూడు పూటలా రైస్ తినవద్దని అంటుంటారు. ఐతే... అమెరికా జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో వెలువరించిన పరిశోధనలో కొత్త విషయం తెలిసింది. బియ్యంలలో ఆ బియ్యం తింటే... కచ్చితంగా బరువు తగ్గుతారని తేలింది.


రోజువారీ తినే పాలిష్ తెలుపు రంగు బియ్యం మూడు పూటలు లేదా రెండు పూటలూ తింటే...


బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అదే... బ్రౌన్ రైస్ (Brown Rice) తింటే మాత్రం బరువు తగ్గుతారని పరిశోధనలో తేలింది. బ్రౌన్ రైస్ అంటే... పేరుకు తగ్గట్టు అవి గోధుమ రంగులోనే ఉంటాయి. తెలుపు రంగు బియ్యంలా మాత్రం అస్సలు ఉండవు.


నిజానికి బియ్యం తెల్లగా ఉండటానికి వాటిని రిఫైండ్ చేస్తారు. పాలిష్ చేస్తారు. ఈ ప్రక్రియలో ఆ బియ్యం తమలో ఉండే సహజసిద్ధమైన కొన్ని ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను కోల్పోతాయి. అదే... బ్రౌన్ రైస్ అయితే... పాలిష్ చెయ్యనివి. అందువల్ల అవి వరి నుంచి ఎలాంటి ప్రాసెసింగ్ జరగకుండా మనకు లభిస్తాయి. అందువల్ల వాటిలో పోషకాలు మనకు అందుతాయి.


ఈ పాలిష్ చెయ్యని బ్రౌన్ రైస్‌లో షుగర్ పాళ్లు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. దీని వల్ల ఈ రైస్ తినేవాళ్లకు ఎక్కువ కేలరీలు బాడీకి చేరవు. అందువల్ల వారు బరువు తగ్గుతారు.


ఈ రైస్‌తో బరువు తగ్గడానికి మరో కారణమూ ఉంది. వీటిలో లభించే పోషకాలు... ఫైబర్... శరీర మెటబాలిజంను క్రమబద్ధీకరిస్తాయి. అంటే బాడీలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ కొవ్వు ఉంటే కరిగించేస్తాయి. తక్కువ కొవ్వు ఉంటే... పెంచుతాయి. న్యూట్రీషనిస్టుల ప్రకారం బ్రౌన్ రైస్ తింటూ... ఇతర బరువు తగ్గించుకునే వ్యాయామాల వంటివి చేస్తే... రెండు వారాల్లో 5 కేజీల దాకా బరువు తగ్గుతారు. ఈ రైస్ కాస్త ధర ఎక్కువే... ప్రయోజనాలు కూడా అందుకు తగ్గట్టే ఉంటున్నాయి.

No comments

Powered by Blogger.