Latest

Loading...

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త... మళ్లీ పెరగనున్న డీఏ...!!

7th Pay Commission

 1. గత రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుస శుభవార్తలు వస్తున్నాయి. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2020 జనవరి నుంచి ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెండింగ్‌లో ఉంది. ఇటీవల డీఏ, డీఆర్ రీస్టోర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


2. ఉద్యోగులకు 2020 జనవరి డీఏ 4 శాతం, 2020 జూలై డీఏ 3 శాతం, 2021 జనవరి డీఏ 4 శాతం మొత్తం కలిపి 11 శాతం డీఏ రీస్టోర్ అయింది.దీంతో 17 శాతంగా ఉన్న డీఏ 28 శాతానికి పెరిగింది. డీఏ పెరగడంతో ఉద్యోగులకు రూ.2,000 నుంచి రూ.25,000 మధ్య వేతనాలు పెరిగాయి



3. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగడంతో హెచ్ఆర్ఏ కూడా పెరిగింది. డియర్‌నెస్ అలవెన్స్ 25 శాతం దాటితే హౌజ్ రెంట్ అలవెన్స్-HRA కూడా సవరించాలని గతంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ ఓ ఆర్డర్ జారీ చేసింది. దీంతో ఉద్యోగులకు 1 నుంచి 3 శాతం వరకు హెచ్ఆర్ఏ పెరుగుతోంది.


4. ఇక అంతకుముందే హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్-HBA విషయంలో ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 7.9 శాతం వడ్డీ రేటుతో 2022 మార్చి 31 వరకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్-HBA తీసుకునే అవకాశం కల్పించింది.


5. మరోవైపు డీఏ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో మరో శుభవార్త వినబోతున్నారు. వారికి 2021 జూలై డీఏ కూడా రావాల్సి ఉంది. ఏడో పే కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రతీ ఏటా రెండు సార్లు డీఏ పెంచాల్సి ఉంటుంది. జనవరి, జూలైలో డీఏ పెరుగుతుంది.


6. 2021 జనవరి డీఏ ఇప్పటికే 4 శాతం పెరిగింది. మరి 2021 జూలై డీఏ ఎంత ఉండొచ్చన్న చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-AICPI డేటాను పరిగణలోకి తీసుకుంటుంది.


7. ఇప్పటికే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-AICPI డేటా వచ్చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం 2021 జూలై డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవడమే పెండింగ్‌లో ఉంది. AICPI 120.6 పాయింట్స్ పెరిగింది.

8. గతంలో డీఏ పెంపు లెక్కల్ని చూస్తే AICPI 130 పాయింట్స్ ఉంటే 4 శాతం డీఏ పెరుగుతుంది. కానీ ఈసారి 130 పాయింట్స్ కన్నా తక్కువే ఉండటంతో 2021 జూలై డీఏ 3 శాతం పెరగొచ్చని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు.


9. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 28 శాతం డీఏ అందుకుంటున్న ఉద్యోగులకు 31 శాతం డీఏ వస్తుంది. డీఏ 3 శాతం పెరుగుతుంది కాబట్టి జీతం కూడా మళ్లీ పెరుగుతుంది.


10. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగిన ప్రతీసారీ పెన్షనర్లకు డీఆర్ కూడా పెరుగుతుంది. డీఏ, డీఆర్ పెంపుతో 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లు లాభపడతారు


11. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డీఏను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి నుంచి మూడుసార్లు పెరిగిన డీఏ ఉద్యోగులకు రావాల్సి ఉంది.


12. ప్రస్తుతం డీఏ రీస్టోర్ చేసినా డీఏ బకాయిలు మాత్రం అలాగే ఉన్నాయి. డీఏ నిలిపివేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.34,402 కోట్లు ఆదా అయినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు తెలిపారు. ఈ బకాయిలు రిలీజ్ కావాల్సి ఉంది.


No comments

Powered by Blogger.