Breaking : రేపట్నుంచి స్కూల్స్ ప్రారంభించవద్దు.... హైకోర్టు కీలక ఆదేశం..!
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ సర్కారీ బడులు తెరవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. కరోనా మూడో దశ ముప్పు ముంచుకొస్తోంది.
ఈ టైంలో ప్రభుత్వం బడులు తెరవడమా? ఇదంత మంచిది కాదు. అమెరికా పిల్లల్ కరోనా కేసుల పెరుగుదల ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. డిజాస్టర్ మేనేజ్మెంట్ పీఎంఓకు రిపోర్టు కూడా ఇచ్చింది. కాబట్టి.. ఈ సమయంలో స్కూళ్ల ఓపెనింగ్సరికాదంటూ- తెలంగాణ హైకోర్టులో బాలకృష్ణ అనే వ్యక్తి ప్రజావాజ్యం దాఖలు చేశారు. పిల్ వేసిన బాలకృష్ణతో మా ప్రతినిథి వెంకట రత్నం ఫేస్ టూ ఫేస్..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా స్థితిగతులు. నిపుణుల హెచ్చరికలను బేరీజు వేసుకుని హైకోర్టు తీర్పు మరోలా వస్తే.. ఇప్పటి వరకూ చేసిన ఏర్పాట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఇప్పటికే విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో వర్చువల్ మీటింగ్ లో పాల్గొని.. తగిన సలహా సూచనలు చేశారు. పారిశుధ్య- శానిటైజేషన్- తాగునీరు- విద్యుత్ తదితర సౌకర్యాల పునరుద్దరణ చేసి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లను కూడా తెరవాల్సిందేనని అంటున్నారు. ఈ సందర్భంగా సీజనల్ వైరస్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని విద్యాలయాలను సర్వం సిద్ధం చేయాలనీ.. ప్రైవేటు విద్యా సంస్థలపై కూడా దృష్టి సారించాలనీ ఆదేశించారు. ట్రాన్స్ పోర్ట్ సమయంలోనే అత్యంత జాగ్రత్తలు పాటించాలని అధికారులకు తేల్చి చెప్పారు.
ఒక పక్క ప్రభుత్వ ఏర్పాట్లు ఇలా ఉంటే.. కరోనా థర్డ్ వేవ్ తో తీవ్ర పరిణామాలు తప్పవన్న హెచ్చరికలున్నాయ్. ఈ వార్తలకు గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఇప్పటికే 18 నెలలు వేచి చూశాం. మరో రెండు నెలలు ఆగితే.. విద్యార్ధులకు పూర్తి వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ప్రారంభిస్తే.. విద్యార్ధుల తల్లిదండ్రులకు వందకు వంద శాతం నమ్మకం కుదురుతుంది. అప్పుడు.. స్కూళ్లు తెరిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.
ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభమైన రాష్ట్రాల్లో కరోనా తాండవిస్తోంది. అమెరికాలో వ్యాక్సిన్ వేస్కున్న పిల్లల్లోనూ కరోనా కనిపిస్తోంది. గత పది రోజుల్లో లక్షా 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్ విషయానికి వస్తే.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 55 పేజీల నివేదికను పీఎంఓకు సమర్పించింది. ఈ రిపోర్ట్ లో థర్డ్ వేవ్ అండ్ చైల్డ్ వర్నరబిలిటీజై పూర్తి వివరాలున్నాయి. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా పాఠశాలలు ప్రారంభించడమేంటి? ఇది సరికాదని అంటున్నారు చాలా మంది. ఇక్కడ స్కూళ్ల పాటికి స్కూళ్లు తెరుచుకుంటే.. ఒక్కసారిగా.. థర్డ్ వేవ్ విజృంభిస్తే. ప్రభుత్వం తీసుకునే చర్యలపై క్లారిటీ లేదు. పిల్లల ఆరోగ్యం ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకునే హైకోర్టులో వాజ్యం వేశామంటున్నారు పిటిషనర్ బాలకృష్ణ. పిటిషనర్ తో మా ప్రతినిథి వెంకటరత్నం ఫేస్ టూ ఫేస్.
పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామంటోంది ప్రభుత్వం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాఠశాలలు ప్రారంభమైన రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నది పిల్ వేసిన వాళ్లంటున్న మాట. ఇలా ఎవరికి వారు తమతమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్న వేళ.. ప్రీ ప్రైమరీ. ప్రైమరీ స్కూళ్లు ఓపెనవుతాయా? లేక డిజాస్టర్ మేనేజ్మెంట్ నివేదిక సూచించిన ప్రకారం నిర్ణయం తీసుకుంటారా తెలియాల్సి ఉంది.
No comments