Latest

Loading...

Corona vaccine గుడ్‌న్యూస్‌.... వీరికి ఒక్క డోసు వ్యాక్సిన్‌ చాలు...!

Corona vaccine

 కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌తో చెక్‌ పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తోన్న ప్రభుత్వం..


వ్యాక్సిన్ల కొరతకు తీర్చేందుకు స్వదేశీ వ్యాక్సిన్లకు తోడు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇక, ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు ఐసీఎంఆర్ అధ్యయనం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే కోవిడ్‌ సోకినవాళ్లు కోవాగ్జిన్.. వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా చాలని చెబుతోంది ఐసీఎంఆర్.. కోవిడ్‌ సోకని వాళ్లు రెండు డోసుల కోవాగ్జిన్ తీసుకుంటే వచ్చే యాంటీబాడీలు.. కరోనా సోకిన వాళ్లు ఒక్క డోసు తీసుకున్నా అదే స్థాయిలో వస్తాయని ఐసీఎంఆర్‌ తన అధ్యయనంలో తేల్చింది. ఈ ఫలితాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో పబ్లిష్ అయ్యాయి.. కరోనా సోకి తగ్గిపోయిన వాళ్లకు సింగిల్ డోసు బీబీవీ152 కోవాగ్జిన్‌ చాలని.. దీని వల్ల వ్యాక్సిన్ కొరతను కూడా అధిగమించే అవకాశం ఉంటుందని పేర్కొంది ఐసీఎంఆర్.


ఇక, తమ అధ్యయనం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై నిర్వహించామని ప్రకటించిన ఐసీఎంఆర్.. ఇందులో భాగంగా SARS-CoV-2కు సంబంధించిన యాంటీబాడీలు డే జీరోన, కోవాగ్జిన్‌ తొలి డోసు తీసుకున్న తర్వాత 28వ రోజున, 56వ రోజున ఎలా ఉన్నాయో పరిశీలించామని.. దీనికోసం 114 మంది రక్త నమూనాలను సేకరించామని.. వారంతా మహమ్మారి సోకినవాళ్లలేనని వెల్లడించింది.. ఇద్దరిలో తప్ప మిగతా వాళ్లందరిలోనూ కోవాగ్జిన్ సింగిల్ డోసు తీసుకున్న తర్వాత యాంటీబాడీల వృద్ధి చాలా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించింది ఐసీఎంఆర్. అయితే, ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని.. సింగిల్‌ డోస్‌ కోవాగ్జిన్‌ టీకా తీసుకున్నాసరే.. వారిలో యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉంటాయన్నమాట.. దానికి తోడు సెకండ్‌ డోస్‌ కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు.. పోటీ పడాల్సిన పరిస్థితి కూడా రాదంటున్నారు.. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments

Powered by Blogger.