Latest

Loading...

Leftover Rice Benfits: చద్దన్నం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు...! తెలిస్తే అస్సలు వదలరు..!!.

 

Leftover Rice Benfits

Leftover Rice Benfits: ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే మరుసటి రోజు ఉదయం తినడం చాలామందికి అలవాటు. ఇలా చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే కొంతమంది చద్దన్నం తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో ఉండే పోషక విలువలు తెలిసిన తర్వాత తప్పకుండా నిర్ణయం మార్చుకుంటారు. అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంతో ఎన్ని రకాల లాభాలుంటాయో అధ్యయనం చేసి మరీ వెల్లడించింది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.


సాధారణంగా అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్‌, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. అందుకే చద్దన్నంలో ఆ పోషకాల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుందట. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయట. అందుకే చద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్‌గా ఉంటుంది. శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభిస్తుంది. వేడి కారణంగా శరీరంలో ఉండే దుష్ఫలితాలు తగ్గుతాయి.


పీచుదనం పెరిగి మల బద్దకం, నీరసం తగ్గిపోతాయి. రక్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉంటుంది. అలసిపోదు. అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారం. ఈ చద్దన్నం సన్నవాళ్లు లావయ్యేందుకు, లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు కూడా తోడ్పడుతుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని చల్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే స్థూలకాయులు క్రమంగా లావు తగ్గుతారు. అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారిసరికే తోడన్నం తయారవుతుంది.





No comments

Powered by Blogger.