NPS rules: నేషనల్ పెన్షన్ స్కీమ్ చందాదారులకు గుడ్‌న్యూస్..... మరిన్ని ప్రయోజనాలే లక్ష్యంగా మార్పులు....వివరాలివే....!!
నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) చందాదారులకు భారీ ఉపశమనం కలిగించే చర్యలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
National Pension Scheme)లో చేరే గరిష్ట అర్హత వయసు పరిమితిని పెంచడంతో పాటు స్కీమ్ నుంచి బయటకు వెళ్లే వారి కోసం కూడా మార్పులు చేపట్టింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA). దీంతో పాటు 65 సంవత్సరాల తర్వాత ఈ పథకంలో చేరిన వారి కోసం నిబంధనలను సవరించింది. వీరి నిధుల్లో 50 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించేందుకు PFRDA అనుమతించింది. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో చేరడానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు ఉండగా, దీన్ని 70 ఏళ్లకు పెంచింది. ఈ మార్పుల తరువాత, ఈ స్కీమ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రవేశ వయసు 18-65 సంవత్సరాల నుంచి 18-70 సంవత్సరాలకు పెరిగింది.
సవరించిన మార్గదర్శకాలకు సంబంధించి పీఎఫ్‌ఆర్‌డీఏ ఒక సర్క్యులర్ విడుదల చేసింది. 65-70 సంవత్సరాల వయసు ఉన్న భారత, విదేశీ పౌరులు (Overseas Citizen of India- OCI) కూడా ఎన్‌పీఎస్‌లో చేరవచ్చు. వీరు 75 సంవత్సరాల వయసు వచ్చేవరకు పథకంలో కొ
నసాగవచ్చు.
ఇప్పటికే NPS చందాదారులుగా ఉండి, అకౌంట్లను మూసివేసిన వారు కూడా.. ప్రస్తుతం పెరిగిన వయసు అర్హత నిబంధనల ప్రకారం కొత్త అకౌంట్ తీసుకునే అవకాశం ఉందని PFRDA ప్రకటించింది. అయితే 65 ఏళ్లు నిండిన తరువాత పథకంలో చేరే చందాదారులు డిఫాల్ట్ 'ఆటో ఛాయిస్' కింద పెట్టుబడి పెట్టినప్పుడు.. వారి గరిష్ట ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను 15 శాతానికే పరిమితం చేసింది.
ఈ మార్పులతో నేషనల్ పెన్షన్ స్కీమ్ చందాదారులు లబ్ధి పొందవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ సర్క్యులర్ తెలిపింది. వారు తమ నిధులతో ఎక్కువ పెన్షన్ ఫండ్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ''65 ఏళ్లు దాటిన తరువాత NPSలో చేరిన చందాదారులు.. ఆటో ఛాయిస్, యాక్టివ్ ఛాయిస్ కింద PF (పెన్షన్ ఫండ్), ఆస్తి కేటాయింపులను (asset allocation) ఎంచుకోవచ్చు. ఆటో ఛాయిస్‌ను ఎంచుకున్న వారి గరిష్ట ఈక్విటీ ఎక్స్‌పోజర్ 15 శాతం వరకు ఉంటుంది. అయితే యాక్టివ్ ఛాయిస్‌ను ఎంచుకున్న వారికి మాత్రం ఇది 50 శాతం వరకు ఉంటుంది'' అని నోటిఫికేషన్ వెల్లడించింది.
No comments