Latest

Loading...

Raisins benefits: తిన్న తరవాత ఆహారం అరగడం లేదా? ఇదొక్కటి తినండి వెంటనే అరుగుతుంది.... !!

 

Raisins benefits



Raisins benefits: చాలా మంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ గృహ వైద్యం గురించి తెలుసుకుంటే చిన్న చిన్న టిప్స్ తో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. చాలా అజీర్ణ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అరుగుదుల కోసం ట్యాబ్లెట్ లు వేసుకుంటుంటారు. అయితే ఇలాంటి వాటికి మందులు అవసరం లేకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అది ఎలా అంటే..


Raisins benefits

నిత్యం ఇంట్లో వాడే వస్తువుల్లో కిస్మస్ ఒకటి. ఇది ఏడాది మొత్తం లభిస్తుంది. దీనిలో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కొలిస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. కిస్మిస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.


మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే వీటిలో ఫెనాల్ పదార్ధం ఎక్కువ శాతం ఉంటుంది. దీన్ని నేరుగా తీసుకోని వాళ్లు పాలతో లేద ఇతర ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించి చిన్న ఆహారం జీర్ణమయ్యేల చేస్తాయి. కడుపులో ఉండే విష వ్యర్ధాన్ని తరిమికొడతాయి. దీంతో పొట్ట శుభ్రం అవుతుంది.


కిస్మిస్ లో ఐరన్, పొటాషియం, కాపర్ లు ఎసిడిటీ లాంటి సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే సోడియం గుండె కండరాలకు మేలు చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఎండిన ద్రాక్ష ప్రతి రోజు తినాలి. కిస్మిస్ లో యాంటీ ఆక్సిడెండ్లు ఎక్కువగా ఉంటాయి. కళ్ల సమస్యలకు కిస్మిస్ చెక్ పెడుతుంది. ప్రతిరోజు 20 కిస్మిస్ లు మించకుండా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.




No comments

Powered by Blogger.