SCHOOLS REOPEN : స్కూళ్లు తెరవడం అంత్యంత అవసరం తేల్చి చెప్పిన పార్లమెంటరీ కమిటి...!!!
కరోనా ప్రభావంతో గత రెండు సంవత్సరాలుగా విద్యాలయాలు తెరుచుకోవడం లేదు..దీంతో గ్రామీణ విద్యార్థులతో పాటు వెనకబడిన ప్రాంతాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి..పరిస్థితుల ప్రభావంతో సుమారు ముప్పై శాతం మంది పిల్లలు అసలు చదువు వైపు చూడడం లేదు..అయితే కరోనా ప్రభావం పిల్లలపై పడుతున్న నేపథ్యంలోనే స్కూళ్లు రీఓపెన్ కావడం లేదు.. దీంతో స్కూళ్లు పిల్లలపై ఎలాంటీ ప్రభావం పడుతుందనే అంశాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం
పార్లమెంటరీ కమిటిని వినయ్ పీ సహాస్రబుద్దే నేతృత్వంలో నియమించింది.
కాగా ఈ కమిటి పలు అంశాలను అధ్యయనం చేసింది. స్కూళ్లు రీఓపెన్ చేయకపోవడంపై పిల్లలతోపాటు తల్లితండ్రులపై పడే ప్రతికూల ప్రభావాలను కమిటి వెలువరించింది.
ఈనేపథ్యంలోనే చాలా కాలంపాటు స్కూళ్లు తెరవకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే అది తల్లిదండ్రులపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వారికి ఇది బాల్య వివాహాలకు కారణం కావడంతోపాటు పిల్లల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని సూచించింది.
స్కూళ్లకు దూరంగా ఉంటూ.. పిల్లలు నాలుగు గోడలకే పరిమితం కావడం తల్లిదండ్రుల, చిన్నారుల మధ్య సంబంధంపైనా ప్రతికూల ప్రభావం చూపెడుతుందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. టీచర్లు, పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థులకు వ్యాక్సిన్ అందించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా పాఠశాలలను తిరిగి ప్రారంభించవచ్చని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ముఖ్యంగా రోజు తప్పించి రోజు లేదా రెండు షిఫ్టుల్లో తరగతులను నిర్వహించడం వల్ల భౌతిక దూరాన్ని పాటించడం వీలవుతుంది. ర్యాండమ్ పద్ధతిలో పిల్లలు, సిబ్బందికి కొవిడ్ టెస్టులు నిర్వహించడం, మాస్కులు, శానిటైజర్ల వాడకం వంటి జాగ్రత్తలతో తరగతులను తిరిగి ప్రారంభించే ఆస్కారం ఉంటుందని సిఫార్సు చేసింది.
వీటికి తోడు ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచుకోవడం, వాటికి శిక్షణ కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచడం వంటి చర్యలనూ సూచించింది. ఆరోగ్య అధికారుల పర్యవేక్షణతో కొవిడ్ నిబంధనలు అమలు చేయవచ్చని పేర్కొంది. స్కూళ్లను తిరిగి తెరవడంలో ఉత్తమ విధానాలు అనుసరిస్తోన్న వివిధ దేశాల చర్యలను పరిగణలోకి తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది.
No comments