Latest

Loading...

Smart Phone: స్మార్ట్ ఫోన్ వేడెక్కుతోందా.... పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...?

Smart Phone


Smart Phone: దేశంలో స్మార్ట్ ఫోన్ల (Smart Phones) వినియోగం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడటంతో చాలామంది వాటిని తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగంతో ప్రమాదాలు సైతం పొంచి ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు పేలిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఫోన్ వినియోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్మార్ట్ ఫోన్ పేలకుండా జాగ్రత్త పడవచ్చు.


స్మార్ట్ ఫోన్ ఏదైనా కారణం చేత పగిలితే కొంతమంది ఫోన్ ను రిపైర్ చేయించకుండా వినియోగిస్తూ ఉంటారు. ఫోన్ పాడైన వెంటనే సర్వీస్ చేయిస్తే మంచిది. అలా చేయించకపోతే పగిలిన చోటు నుంచి నీరు లేదా చెమట ఫోన్ లోకి ప్రవేశించి ఫోన్ పై ఒత్తిడి పెంచడం వల్ల బ్యాటరీ పేలే అవకాశం ఉంటుంది. నకిలీ ఛార్జర్లు, బ్యాటరీల వల్ల ఫోన్ హీటయ్యే అవకాశాలు ఉంటాయి. కంపెనీ ఛార్జర్ పాడైతే కంపెనీ సూచించిన ఛార్జర్లను మాత్రమే వినియోగించాలి.

ఫోన్ తరచూ వేడెక్కుతోందని గమనిస్తే ఆ ఫోన్ ను వినియోగించకుండా ఉంటే మంచిది. ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్ ను వినియోగించడం, బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్న సమయంలో ఫోన్ ను వినియోగించడం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకే ఛార్జింగ్ కేబుల్ ను వేర్వేరు అవసరాల కొరకు వినియోగించవద్దని నిపుణులు పేర్కొన్నారు. ఫోన్ ను 100 శాతం ఛార్జింగ్ చేయకూడదని 90 శాతం చేస్తే చాలని ఎక్కువ సమయం ఛార్జ్ చేసినా ఫోన్ పేలిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.


సూర్యరశ్మి తగిలే చోటులో ఫోన్ ను ఛార్జ్ చేయడం మంచిది కాదని వేడిని పుట్టించే వస్తువులకు దూరంగా ఉంచి ఫోన్ ను ఛార్జ్ చేస్తే మంచిదని నిపుణులు పేర్కొన్నారు. ఫోన్ లో ఏదైనా సమస్య ఉంటే ఆ ఫోన్ కంపెనీ సర్వీస్ సెంటర్ కు వెళ్లి రిపేర్ చేయిస్తే మంచిదని టెక్ నిపుణులు సూచనలు చేస్తున్నారు.

No comments

Powered by Blogger.