7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... ఆ ఉత్తర్వులు వచ్చేశాయి
1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జులై 1 నుంచి కొత్త డీఏ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఉద్యోగుల డీఏ 17 శాతం ఉండగా..
ఇప్పుడు 11 శాతం పెరిగి మొత్తం 28 శాతం (DA Hike) అయింది. కరోనా కారణంగా 2020 జనవరి, 2021 జూన్ మధ్య రావాల్సిన మూడు డీఏలను నిలిపివేసిన కేంద్రం.. జులై 1 నుంచి మూడు డీఏలతో కలిపి కొత్త వేతనాలను అందిస్తోంది.
2. అయితే 2020 జనవరి, 2021 జులై మధ్య పదవీ విరమణ పొందిన పెన్షనర్ల డీఏ, గ్రాట్యూటీ విషయంలో కేంద్రం తాజాగా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. వారి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏను గ్యాట్యూటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్లతో కలిపి చెల్లిస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది
3. ఈ ఉత్తర్వులపై పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ ట్వీట్ చేస్తూ ''పెన్షనర్ల గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యామెంట్ చెల్లింపులపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్డీచర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ ఉత్తర్వులు 2020 జనవరి నుంచి 2021 జూన్ మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి" అని పేర్కొంది.
4. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972లో నిబంధనల ప్రకారం, ఉద్యోగి రిటైర్ అయ్యే తేదీకి అమల్లో ఉన్న డీఏను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. వాటిని ఎమ్యుల్మెంట్‌లుగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఆఫీస్ మెమోరాండంలో పేర్కొంది.
5. సీసీఎస్ (లీవ్) రూల్స్, 1972లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, రిటైర్‌మెంట్ తేదీకి ఉన్న డీఏ ప్రకారం లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మొత్తాన్ని లెక్కిస్తారు. ఆఫీస్ మెమోరాండంలోనే ఈ విషయాన్ని పేర్కొంది. ఈ రెండు రూల్స్‌లో పేర్కొన్న నిబంధనల ఆధారంగానే కేంద్రం నేషనల్ పర్సంటేజ్ ఆఫ్ డీఏను ప్రకటించింది
6. ఆఫీస్ మెమోరాండం ప్రకారం, 2020 జనవరి 1 నుంచి 2020 జూన్ 30 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగుల డీఏ వారి ప్రాథమిక వేతనానికి 21 శాతంగా లెక్కిస్తారు. 2020 జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగుల డీఏ ప్రాథమిక వేతనానికి 24 శాతంగా లెక్కిస్తారు
7. ఆఫీస్ మెమోరాండం ప్రకారం, ఈ సంవత్సరం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ప్రాథమిక వేతనంలో 28 శాతాన్ని డీఏగా లెక్కిస్తారు.
No comments