Latest

Loading...

Aadhaar card photos update : ఆధార్ కార్డుపై మీ పాత ఫోటోను ఇలా మార్చుకోండి...

Aadhaar card photos update

 How to change your photo on Aadhaar card:

ఆధార్ కార్డు లేనిదే కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినా లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయినా పొందడం కష్టమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలే కాదు.. చివరకు బ్యాంకుల్లో ఖాతా తెరిచేందుకైనా లేదా ఎల్పీజీ కనెక్షన్ ఇచ్చే ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు అయినా ఆధార్ ఇవ్వనిదే డాక్యుమెంటేషన్ (LPG connection documents) పని పూర్తి చేయడం లేదు. అంతేకాదు.. మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సేవలు అందించే టెలికాం ఆపరేటర్స్ సైతం ఆధార్ కార్డు (Aadhaar card) లేకుండా సిమ్ కార్డు కానీ కనెక్షన్ కానీ ఇవ్వడం లేదు.


ఆధార్ కార్డుకు అంత ప్రాధాన్యత, ప్రత్యేకతలు ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో ఆధార్ కార్డులపై కార్డుదారుల ఫోటోలు సరిగ్గా ప్రింట్ అవలేదనే సంగతి తెలిసిందే. ఇదే విషయమై సోషల్ మీడియాలో, సినిమాల్లో అనేక జోకులు కూడా ఉన్నాయి. అయితే, ఆధార్ కార్డులపై మీ పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్స్, పుట్టిన రోజు తేదీలు ఎలాగైతే మార్చుకుంటున్నారో అలాగే ఆధార్ కార్డుపై ఫోటోను సైతం అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్ ప్రాధికారిక సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వీలు కల్పిస్తోంది.


ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ చేయడం కోసం ముందుగా ఆన్లైన్లో రిక్వెస్ట్ సబ్మిట్ చేసి ఆ తర్వాత సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కి (Aadhar Enrolment centre) వెళ్తే.. అక్కడి సిబ్బంది కొత్త ఫోటో తీసుకుంటారు.


How to update your photo on Aadhaar card : ఆధార్ కార్డులో ఫోటోను అప్‌డేట్ చేయడం ఎలా అంటే..


ఆధార్ ప్రాధికారిక సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అధికారిక వెబ్‌సైట్‌లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారం (Download Aadhaar Enrolment Form) డౌన్లోడ్ చేసుకోవాలి.


ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారంలో (Aadhaar Enrolment Form download) పూర్తి వివరాలు నమోదు చేయాలి.


మీకు సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కి (Aadhar Enrolment centre) వెళ్లాలి.


ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లోని ఎగ్జిక్యూటీవ్‌కి ఆ ఫారంని అందించాలి.


బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా (biometric verification) ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లోని ఎగ్జిక్యూటీవ్‌ మీ వివరాలు వెరిఫై చేస్తారు.


అదే సమయంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్‌ మీ ఫోటో కూడా తీసుకుంటారు.


ఆధార్ కార్డుపై ఫోటో అప్‌డేట్ కోసం రూ. 25 ప్లస్ జీఎస్టీతో కలిపి ఫీజు (Aadhaar photo update request fee) చెల్లించాల్సి ఉంటుంది.


ఆన్లైన్లో మీ రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన అనంతరం మీ అప్‌డేట్ దరఖాస్తు వివరాలు తెలియజేస్తూ ఒక రసీదు (Aadhaar acknowledgement slip) అందిస్తారు.

ఆధార్ కార్డుపై ఫోటో అప్‌డేట్ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఆ రసీదులో ఉన్న అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN) ఆధారంగా ట్రాక్ చేయవచ్చు.


ఫోటో అప్‌డేట్ అయిన అనంతరం ఆధార్ కార్డు ఈ-కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు (Aadhaar card e-copy download).


కార్డుహోల్డర్స్ ఫిజికల్ పీవీసీ కార్డు (Physical PVC card) కోసం కూడా ఆధార్ పోర్టల్‌పై దరఖాస్తు చేసుకోవచ్చు.

No comments

Powered by Blogger.