Latest

Loading...

Aadhaar card. ఇకపై 'ఆధార్‌'లో తండ్రి పేరు , భర్త పేరు ఉండదు.....!

Aadhaar card

 తండ్రి/భర్త అనే పదాలను తొలగించిన అధికారులు

ఆ స్థానంలో కేరాఫ్ అనే పదం దేశంలోని అతి ముఖ్యమైన ధ్రువపత్రాలలో ఆధార్ కార్డు ఒక్కటి.


అయితే ఇప్పుడు ఆధార్ కార్డులో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తాజాగా ఆధార్ కార్డు కేంద్రానికి వెళ్లిన కొందరు పౌరులు ఓ కీలక విషయాన్ని గుర్తించారు. ఆధార్ కార్డును అప్‌డేట్ చేస్తే ఇకపై అందులో తండ్రి పేరు/భర్త పేరు అని ఉండదు. సంరక్షకుడికి, కార్డుదారుడికి మధ్య ఉన్న బంధుత్వాన్ని తెలిపే అవకాశం ఉండదు. ఆధార్ కార్డులో ఇకపై తండ్రి లేక భర్త అనే ఆప్షన్ వద్ద కేరాఫ్ అనే పదం మాత్రమే ఉంటుంది.


ఓ ఖాతాదారుడు ఈ విషయాన్ని గుర్తించి ఆధార్‌కార్డులో పొరపాటుగా కేరాఫ్ అని పడిందేమో అనుకుని ఆధార్ కేంద్రానికి విషయం తెలిపాడు. అయితే తండ్రి పేరు, భర్త పేరు అనే పదాలను తొలగించి కేరాఫ్ అని ఉద్దేశపూర్వకంగానే మార్చామని అధికారులు తెలిపారు.


ఇకపై ఆధార్ కార్డులో బంధుత్వాన్ని తెలిపే పదాలు ఉండబోవని, కేరాఫ్ అని ఉంటుందని చెప్పారు. కార్డుదారుడు కేరాఫ్ లో తన బంధుత్వాన్ని తెలియకుండానే సంరక్షకుడి పేరును రాస్తూ సరిపోతుందని అధికారులు తెలిపారు. పౌరుడి వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగానూ భంగం కలగకూడదని గతంతో సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు అధికారులు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

No comments

Powered by Blogger.